For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సానియా చేతుల మీదుగా డికె బోస్ ఫస్ట్ లుక్

    By Pratap
    |

    హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు విరామం పెట్టి భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటోంది. ఈ సమయంలో తెలుగు సినిమా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె సిద్ధపడినట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అమెరికాలో ఈ నెల 21వ తేదీన సందీప్ కిషన్ చిత్రం డికె బోస్ అనే తెలుగు చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

    డికె బోస్ చిత్రం రోమాంటిక్ యాక్షన్ చిత్రం. డికె బోస్ చిత్రం ద్వారా దర్శకుడిగా ఎన్ బోస్ తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నాడు. రాండమ్ థాట్స్ బ్యానర్‌పై ఆనంద్ రంగ, శేషు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ శక్తివంతమైన పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.

    నిషా అగర్వాల్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సందీప్‌తో నిషా అగర్వాల్ కెమిస్ట్రీ సినిమాకు అదనపు ఆకర్షణను అందిస్తుందని భావిస్తున్నారు. పీలేరు, నర్సీపట్నం, హైదరాబాదుల్లో షూటింగ్ జరిగింది. అత్యంత ప్రధానమైన పర్యాటక స్థలాలు లంబాసింఘీ, థాసింఘీల్లో పాటల చిత్రీకరణ జరిగింది.

    డికె బోస్ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. అచ్చు సంగీతాన్ని అందించారు. విశ్వేశ్వర్ ఎస్వీ కెమెరాకు పని కల్పించారు. స్క్రిప్టు ఎన్ బోస్ రాసుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

    English summary
    The rumour mills in the T-Town are abuzz with the news that Indian tennis player Sania Mirza, who is now staying with her husband Shoaib Malik in Dubai, is taking a break from her games to attend a Telugu filmy event. She is reportedly set to unveil the first look of Sundeep Kishan's upcoming Telugu film DK Bose in Miami, USA on March 21.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X