»   »  అబ్బే!అంత సమర్దుడేం కాదు...సంజన

అబ్బే!అంత సమర్దుడేం కాదు...సంజన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sanjana
పూరీ 'బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన హాట్ బేబి సంజన. ఆమె అసలు మొదట 'మొగుడు పెళ్ళాం ఓ బాయ్ ఫ్రెండ్' అనే కన్నడ రీమేక్ తోనే ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చింది. దాంతో ఆమె దేనికైనా రెడీ అన్న టాక్ పరిశ్రమలో వచ్చేసింది. అందులోనూ ఆమె తెలుగులో నిలదొక్కుకోవటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమె తాజాగా రాజా హీరోగా చేస్తున్న సమర్ధుడు అనే చిత్రంలో చేస్తోంది. అయితే ఆమె రాజా గురించి అన్నట్లుగా చెప్పబడుతున్న కొన్ని కామెంట్స్ బయిట షికార్లు చేస్తున్నాయి. వారు చెప్పుకుంటున్న దాని ప్రకారం ఆమె...రాజాతో సమర్ధుడు అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఓ అర్ధరాత్రి అతను ..ఆమె తలుపు తట్టాడుట.

అయితే అంత రాత్రి పూట తన రూమ్ లో అతనికేం పని అని ఆమె మొదట కంగారుపడిందిట. ఏవన్నా ఆడ్ గా బిహేవ్ చేస్తే సీరియస్ గా బుద్ది చెప్పి పంపుదామని ప్రిపేర్ అయిందిట. అయితే అతను ఆ రకమైన ఆలోచనతో రాలేదుట. వేరే విషయాలు మాట్లాడాడి కాసేపుండి వెళ్ళిపోయాడుట. మరుసటి రోజు కూడా సేమ్ సిట్యువేషన్ రిపీట్ అయిందిట. దాంతో ఆమె ఊపిరి పీల్చుకున్నానని..రాజా సమర్ధుడే అని చెప్పి నవ్వుతోందిట. అయితే ఆమె నవ్వులో వేరే అంతరార్ధం ఉందని విన్న వాళ్ళు అనుకున్నారుట. అయినా పగలంతా ఆమె తో షూటింగ్ లోనే ఉంటున్నాడు కదా నిజంగా మాట్లాడాలనిపిస్తే అప్పుడే ఆ పని చేయవచ్చు కదా,రాత్రి ఆమె రూమ్ కి వెళ్ళాడంటే...వేరే ఏం ఉంటుందనేది.. అనేది వారి వాదన. అలాగే ఎవరైనా ఇలా సంజన లాంటి వారి వద్దకు వచ్చి చెయ్యేస్తే ఒక గొడవ వెయ్యకపోతే వేరే గొడవ అని వారు విశ్లేషించుకుంటున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X