పవన్ ‘బద్రి’ని గిఫ్టుగా ఇచ్చే ప్రయత్నంలో బిగ్ హీరో

తాజాగా అందిన సమాచారం ప్రకారం అప్పట్లో వచ్చిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ 'బద్రి' రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి బాలీవుడ్ బిగ్ హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రలో సంజయ్ దత్ ఏం సెట్టవుతాడు అని ఆశ్చర్య పోకండి. ఎందుకంటే ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకునేది ఆయన నటించేందుకు కాదు, తన స్నేహితుడైన అజయ్ దేవగన్ కు గిఫ్టుగా ఇవ్వడానికే అని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం సంజయ్ దత్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్టుమెంట్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మంచు లక్ష్మి ప్రసన్న సంజయ్ భార్యగా నటిస్తోంది. తెలుగు హీరో రాణా కూడా ఈ సినిమాలో పోలీసాఫీర్ గా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ హీరిష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











