మధు శాలినిని..వద్దన్న సంజయ్ దత్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని తెలుగు సినీ పరిశ్రమ నుంచి రాణా, మంచు లక్ష్మి, మధు శాలిని బాలీవుడ్ మూవీ 'డిపార్టు మెంటు'చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మధుశాలిని ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో మధు శాలినితో ఓ ఐటం సాంగు కూడా చేయించాలని నిర్ణయించాడు రామ్ గోపాల్ వర్మ. ఆ ఫాటలో సంజయ్ దత్ తో ఆమె నర్తించాల్సి ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ఐటం సాంగు నుంచి ఆమెను తప్పించారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సంజయ్ దత్ ఆమెతో ఐటం సాంగు చేయించడంపై సముఖంగా లేడని, మంచి హైప్ ఉన్న సాంగు కాబట్టి మధు శాలిని గ్లామర్ ఆ పాటకు సరిపోదని, ఇందుకోసం కసక్కుమనే బ్రెజిల్ మోడల్ ను తీసుకోవాలని నిర్ణయించాడట. సంజయ్ మాట కాదనలేక వర్మ కూడా అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధరమ్ ఓబెరాయ్, సంజయ్ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రాణా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, కంగన రనౌత్, రవీనా టండన్, అభిమన్యు సింగ్, మధుశాలిని తదితరులు ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











