మహేశ్ బాబు మూవీలో బాలీవుడ్ స్టార్: అదిరిపోయే పాత్రలో కనిపించనున్న బడా హీరో

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లపై ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఫలానా హీరో డైరెక్టర్ కలయికలో సినిమాలు రావాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదరు చూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. సీనియర్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలను చేశారు. ఇవి వచ్చి చాలా కాలమే అవుతోన్న మూడో సినిమా మాత్రం రాలేదు. అందుకే మహేశ్, త్రివిక్రమ్ మళ్లీ జోడీ కట్టాలని చాలా కాలంగా అందరూ కోరుకుంటూ ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది రోజుల క్రితమే వచ్చింది. దీంతో ఇరు స్టార్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ తన కొత్త సినిమాను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నాడు. కానీ, ఎందుకో అది ప్రకటనకే పరిమితం అయిపోయింది. దీంతో దాని స్థానంలో మహేశ్ బాబు మూవీని లైన్‌లో పెట్టాడు. ఇక, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకపోయినా.. దీని గురించి ఎన్నో రకాల వార్తలు మాత్రం ఈ మధ్య కాలంలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

 Sanjay Dutt Key Role in Mahesh Babu Movie

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అంతలో దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్టును రెడీ చేసి పెట్టేశాడు. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులను సైతం దాదాపుగా కంప్లీట్ చేసేశాడు. ఈ క్రమంలోనే టెక్నీషియన్లను కూడా ఎంపిక చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు నటీనటులపై దృష్టి సారించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మకం చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడట. సినిమాలోనే ఎంతో ప్రాధాన్యత ఉన్న ఓ రాజకీయ నాయకుడి పాత్రను ఆయన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రోల్ నెగెటివ్ షేడ్స్ ఉంటుందని, అలా అని ఇది విలన్ పాత్ర కాదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందులో నటించేందుకు సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని సమాచారం. ఇక. ఈ మూవీలో ఆయన నటిస్తున్నాడన్న విషయాన్ని చిత్ర యూనిట్ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతుందని అంటున్నారు. ఈ ప్రకటన కోసం ఫ్యాన్స్ అంతా వేచి చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంటనే అంటే మరో నెల రెండు నెలల్లో త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్‌ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్, ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి పని చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X