NBK109: బాలయ్యతో మరో పాన్ ఇండియా స్టార్.. ఏకంగా ఇంత మంది హీరోలు ఎందుకో!
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో అందరి కంటే ఎక్కువ సక్సెస్ రేటుతో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను అందుకుంటోన్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే వచ్చిన పోస్టర్లు డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరగ్గా.. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు.

బాలయ్య కెరీర్‌లోనే గతంలో ఎప్పుడూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్ వెళ్లి చిత్రీకరణను జరుపుతోంది.
బాబీ - బాలయ్య కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు న్యూస్ లీకైంది. అంతేకాదు, ఆయన కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, తాజా షెడ్యూల్‌లో కూడా ఆయన భాగం అయ్యారు.

హై రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీలో ఇప్పటికే దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్ సంజయ్ దత్ కూడా ఇందులో నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అయితే, ఆయన ఏ పాత్రను చేస్తున్నారు అన్నది మాత్రం తెలియలేదు. కానీ, త్వరలోనే ఆయన షూట్‌లో పాల్గొనబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి యాక్షన్‌తో, డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











