టాలీవుడ్‌లోకి సంజయ్‌దత్ రీ ఎంట్రీ.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కోసం మరోసారి!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి టాలీవుడ్‌లోకి డైరెక్టుగా అడుగుపెడుతున్నారు. గతంలో అతిథి పాత్రకే పరిమితమైనప్పటికీ.. ఈసారి పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులకు చేరువ కానున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తాజా చిత్రం అయిననూ పోయి రావాలి హస్తిన (వర్కింగ్ టైటిల్)కు అనే చిత్రం కోసం రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే..

కేజీఎఫ్2 చిత్రంలో
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హిందీ చిత్రాల ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులు. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో అధీరా అనే ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర అవెంజర్స్‌లోని థానోస్ పాత్ర మాదిరిగా పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని ఇటీవల చెప్పారు.

నాగార్జున చంద్రలేఖ చిత్రంలో
గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చంద్రలేఖ చిత్రంలో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించారు. కేవలం కొన్ని నిమిషాల నిడివి పాత్రే అయినప్పటికీ ఉన్నంత సేపు తనదైన కామెడీతో నవ్వించి సంజూ బాబా ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత పెద్దగా తెలుగు తెరపైన కనిపించలేదు. మళ్లీ ఆయన తెలుగులోకి వస్తున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంలో
అయితే పోయి రావాలి హస్తినకు అనే చిత్రం కోసం త్రివిక్రమ్ సంప్రదించారని, ఆ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర కోసం కథను వినిపించగా సానుకూలంగా స్పందించారని తెలిసింది. లాక్‌డౌన్ పిరియడ్‌లో వీడియో కాల్ ద్వారా తన కథను చెప్పినట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది.

దుష్ట రాజకీయవేత్తగా
తాజాగా తెలుగు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. పోయి రావాలి హస్తినకు చిత్రంలో సంజయ్ దత్ రాజకీయ వేత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ సినిమాలో కనిపించినంతగా ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ పాత్రలో పూర్తిస్తాయి విలనిజం ఉంటుంది అని తెలిసింది.
Recommended Video

జాన్వీ కపూర్ లేదా పూజా హెగ్డే
ఇక పోయి రావాలి హస్తినకు చిత్రంలో హీరోయిన్ ఎంపికపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఒకవేళ ఆమె డేట్స్ అడ్జస్ట్ అయితే జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే పూజా హెగ్డేను ఈ చిత్రంలోకి తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











