కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్
ముంబయి పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం సాయంత్రం ముంబయి కోర్టు ఎదుట లొంగిపోయారు. ఆయనను ఎరవాడ జైలుకు తరలించనున్నారు. టాడా కోర్టు తీర్పు ప్రతిని అందజేయడంతో ఆయన కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
జైలు శిక్ష వేస్తూ టాడా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులు అందకపోవడంతో ఎగువ కోర్టు సంజయ్ దత్ కు బెయిల్ మంజూరు చేసింది. టాడా కోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశిస్తూ ఆ బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ దత్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కనీసం వారం రోజుల పాటు ఆయన జైలులో ఉండాల్సి రావచ్చు.


Click it and Unblock the Notifications











