మెగాస్టార్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో... ఒప్పించేసిన డైరెక్టర్.. నిజమైతే ఇక రచ్చే!
కొంత కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలను అనౌన్స్ చేస్తూ వాటిని మొదలు పెడుతూ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆచార్య సినిమతో ప్రేక్షకుల ముందుకు రానుండగా తరువాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ అనే సినిమాలు చేస్తున్నారు. అయితే భోళా శంకర్ సినిమా గురించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస సినిమాలతో
రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమాతో ప్రేక్షకులకును మెప్పించారు . ఆ వెంటనే 'ఆచార్య' అనే సినిమాను కూడా మొదలు పెట్టేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఆ గ్యాప్ లో
ఆచార్య' షూటింగ్ జరుగుతోన్న సమయంలో పలుమార్లు కోవిడ్ వల్ల లాక్‌డౌన్ రావడంతో ఆ గ్యాప్‌ను తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం వాడుకున్నారు చిరంజీవి. ఇందులో భాగంగానే అప్పుడే కొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమా అనౌన్స్ చేశారు.

భోళా శంకర్ కోసం
చిరంజీవి ప్రకటించిన వాటిలో 'భోళా శంకర్' మూవీని టాలీవుడ్‌లో డిజాస్టర్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటన రాగా ఇటీవలే ఈ సినిమాలో విలన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అయింది.

సంజయ్ దత్ విలన్ గా
ఈ సినిమాకి విలన్ గానూ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంజయ్ దత్ కేజీఎఫ్ 2లో అధీరా అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే ఆయనని భోళా శంకర్ సినిమాలో విలన్ గా ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే మెహర్ రమేష్ సంజయ్ దత్‌ని సంప్రదించి, ఆయన పాత్రకు సంబంధించిన నేరేషన్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇది నచ్చి ఆయన ఆమోదం తెలిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Recommended Video

క్లారిటీ రావాల్సిందే
మరో పక్క ఆయనను గాడ్ ఫాదర్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ చేసిన రోల్ కోసం అడిగారని కూడా ప్రచారం జరుగుతోంది. గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా ఆయన్ను విలన్ గా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నాగార్జున చంద్రలేఖ లో అతిథిగా ఒక చిన్న పాత్రలో మెరిసిన సంజయ్ దత్ మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగులో ఫుల్ లెంత్ రోల్ చేయనుండడం ఆసక్తిని రేపుతున్నా అసలు ఏ సినిమాలో అనే దాని మీద క్లారిటీ లేకపోవడం కలకలం రేపుతోంది. అయితే గాడ్ ఫాదర్ సినిమాలో ఇప్పటికే సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.


Click it and Unblock the Notifications











