Devara: ఎన్టీఆర్ మూవీలో మరో స్టార్ హీరో.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అదే అసలైన ట్విస్ట్
ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు హిట్లు కొట్టడం చాలా కష్టంగా మారింది. అలాంటిది వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో RRR మూవీతో ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించాడు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుని మరింత జోష్‌తో ముందుకు వెళ్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే స్టార్ట్ చేశారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన ఎన్నో భారీ యాక్షన్ షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా కోసం 60 శాతం పైగానే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.

'దేవర' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవలే గోవాలో జరిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, శ్రీకాంత్, జాన్వీ కపూర్‌లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా జరపాలని యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంలో వేరే ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది నటీనటులు భాగం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో బాగా వైరల్ అవుతోంది.
వాస్తవానికి 'దేవర' మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ కూడా ప్రతినాయకుడిగానే కనిపించబోతున్నారట. ఇదే ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని తెలిసింది. ఆయన మొదటి పార్టు క్లైమాక్స్‌లోనే కనిపిస్తారని అంటున్నారు. అంటే సెకెండ్ పార్టులో సంజయ్ దత్ విలన్‌గా రచ్చ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలోని మొదటి పార్టును 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











