RRR: మరో ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లతో రాజమౌళి సంప్రదింపులు?
'బాహుబలి' తర్వాత రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటే స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతకు మించిన పెద్ద ప్రాజెక్ట్ 'RRR' టైటిల్‌తో రూపొందిస్తున్నారు జక్కన్న.
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్, తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇటీవల ప్రెస్ మీట్లో వెల్లడించారు.

సంజయ్ దత్, వరుణ్ ధావన్?
దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కించడంలో భాగంగా భారీ తారాగణం ఎంపిక చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ టాప్ స్టార్స్ సంజయ్ దత్, వరుణ్ ధావన్‌లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఇంకా ఫైనల్ కాలేదు
1920 బ్రిటిస్ కాలం నాటి కథతో RRR మూవీ తెరకెక్కుతోంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్లు ఉంటేనే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నారని, సంజయ్ దత్, వరుణ్ ధావన్ విషయం ఇంకా ఫైనల్ కాకపోవడం వల్లనే ఇటీవల ప్రెస్ మీట్లో వెల్లడించలేదని టాక్.

అల్లూరి, కొమురం భీమ్
అల్లూరి సీతా రామరాజు, కొమురం భీం యుక్తవయసులో ఉన్నపుడు ఎవరికీ కనిపించకుండా వెళ్లిన సమయంలో.... ఏం జరిగింది అనే పాయింటును బేస్ చేసుకుని ఫిక్షనల్ స్టోరీతో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లూరి పాత్రలో రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

ఆర్ఆర్ఆర్
‘ఆర్ఆర్ఆర్' చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ కోల్‌కతా జరుగబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి.. నిర్మాణానంత పనులు త్వరత గతిని కంప్లీట్ చేసి జులై 30, 2020 నాటికి సినిమా పూర్తి చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు.


Click it and Unblock the Notifications











