Double iSmartలో మరో స్టార్ హీరో.. 25 ఏళ్ల తర్వాత మళ్లీ.. గట్టిగా ప్లాన్ చేసిన పూరి
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. మాస్, డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ గా యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. హీరోను ఎలివేట్ చేసే ఆయన టేకింగ్ కు యావత్ తెలుగు ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. హీరోయిజంతోపాటు కథానాయకుడిలో కొద్దిపాటి నెగెటివ్ షేడ్స్ చూపించి సరికొత్త పంథాను చూపించాడు. ఇదిలా ఉంటే ఇటీవల లైగర్ మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie). ఈ సినిమాలో రామ్ పోతినేనితోపాటు ఓ స్టార్ హీరో నటించనున్నాడని తెగ చర్చ జరుగుతోంది.
పోస్టర్ ద్వారా: పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు రామ్ కెరీయర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్ హిట్ గా నిలిచింది. ఇక దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా రానన్నట్లు ఇటీవల పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.

గ్రాండ్ లాంచ్: ఇక జూలై 10 సోమవారం రోజున ప్రత్యేక అతిథుల సమక్షంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రాండ్ గా లాంచ్ చేశారు. జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమం గురించి ప్రకటించినప్పుడే విడుదల తేదిని కూడా అనౌన్స్ చేసింది పూరి కనెక్ట్స్.
ఇద్దరు ముద్దుగుమ్మలు: మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను 2024 మార్చి 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పూరి కనెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ సాహో ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు సమచారం. మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారట.

మరో అగ్ర హీరో: సీనియర్ హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారని టాక్. ఈ మూవీ కోసం రామ్ పోతినేని డిఫరెంట్ మేకోవర్ తో కనిపించాడు. ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ తో పాటు మరొక అగ్ర హీరో నటిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నాగార్జునతో: బాలీవుడ్ పాపులర్ యాక్టర్ సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. ఆయన ప్రతినాయకుడిగానే కనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వినికిడి. ఇదే కనుక నిజమైతే సంజయ్ దత్ తెలుగులో నటించిన రెండో సినిమా అవుతుంది. ఆయన 25 ఏళ్ల క్రితం అంటే 1998లో నాగార్జున చంద్రలేఖ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.

లియోలో కూడా: మళ్లీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత నేరుగా తెలుగు సినిమాలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇది చూస్తుంటే ఈసారి పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాను గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబో లియో సినిమాలో కూడా సంజయ్ దత్ నటిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











