బిగ్ ఫైట్: బాలయ్య VS పవన్ కళ్యాణ్... చరణ్ ముందుకు, మహేష్ వెనక్కి?
సంక్రాంతి 2018 బాక్సాఫీస్ బిగ్‌ఫైట్ స్టార్స్ సిద్ధమవుతున్నారు. ఈ సారి పోటీ పవన్ కళ్యాణ్-బాలకృష్ణ మధ్య ఉంటుందట.
Recommended Video

తెలుగు సినిమా పరిశ్రమలో అతిపెద్ద బాక్సాఫీసు ఫైట్ జరిగేది ఎప్పుడూ అంటే ప్రతి ఒక్కరూ సంక్రాంతి ఫైటే అని వెంటనే చెబుతారు. ఇండస్ట్రీకి వసూళ్ల పంటపండించే సీజన్ సంక్రాంతి. ఈ బిగ్‌పైట్ కోసం ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు సిద్ధం అవుతుంటారు.
2018 సంక్రాంతికి జరుగబోయే బిగ్ ఫైట్ గురించి ఇండస్ట్రీలో ఇప్పటి నుండే హాట్ టాపిక్ మొదలైంది. టాలీవుడ్ అగ్రహీరోలైన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలు సంక్రాంతి రిలీజే టార్గెట్‌గా సిద్దం అవుతున్నాయి.

చివరకు బరిలో ఎవరు?
ప్రతి ఏడాది ఇలా పలువురు హీరోల సినిమాలు సంక్రాంతి టార్గెట్‌గా దూసుకురావడం.... తీరా పోటీ సమయం ఆసన్నం అయ్యే సమయానికి వివిధ కారణాలతో కొందరు బరి నుండి నిష్క్రమించడం, ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు పోటీ పడటం చూస్తూనే ఉన్నాం. ఈ సారి పోటీకి సిద్ధం అవుతున్న నలుగురు హీరోల్లో చివరకు ఎవరు బరిలో నిలుస్తారు అనేది హాట్ టాపిక్ అయింది.

బాలయ్య VS పవన్ కళ్యాణ్
2018 సంక్రాంతి బరిలో నలుగురు హీరోల్లో చివరకు ఇద్దరు మాత్రమే నిలిచే అవకాశం ఉందని, ఫైనల్‌గా బాక్సాపీసు బరిలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్యే పోటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ముందుగానే వస్తున్న చరణ్
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం' చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ముందు నుండీ ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా.... డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలా చయడం వల్ల థియేటర్లు ఎక్కువ లభిస్తాయని, తద్వారా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారట.

మహేష్ మూవీ ఆలస్యం?
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతి విడుదలే లక్ష్యంగా షెడ్యూల్ తయారు చేశారు. అయితే ఈ మధ్య షూటింగుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం, ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకావం ఏదని అంటున్నారు. అయితే అఫీషియల్‌గా మాత్రం ఏ ప్రకటన రాలేదు.

శర వేగంగా పవన్-త్రివిక్రమ్ షూటింగ్
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

బాలయ్య 102
బాలయ్య నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. బాలయ్య తన 102వ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలచేసే ఆలోచనలో ఉన్నారు.

ఫైనల్ ప్రత్యర్థులు ఎవరో?
అయితే సంక్రాంతి బరిలో ఫైనల్‌గా నిలిచేది ఎవరు? ఎవరి మధ్య పోటీ ఉంటుంది? అనేది ఖరారు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











