సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీకి బంపరాఫర్? మెగాస్టార్ తో రొమాన్స్ చేసేది ఎవరంటే?
ఇపుడు తెలుగు సినిమా దగ్గర మన సీనియర్ హీరోలు ఏ రకంగా రాణిస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నట సింహ బాలకృష్ణ అయితే వరుసగా నాలుగు హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంటే విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో యంగ్ జెనరేషన్ లేదు పాత జెనరేషన్ లేదు రీజనల్ గా రికార్డు వసూళ్లు అందుకొని దుమ్ము లేపేసారు.
ఇక వీరితో పాటుగా అక్కినేని నాగార్జున పాన్ ఇండియా లెవెల్లో హిందీ, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లో సాలిడ్ పాత్రలు చేస్తున్న నాగార్జున ఇలా ఫామ్ లో ఉన్నారు. కానీ వీరిని మించిన బిగ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా భారీ డిజాస్టర్ అవుతుంది. దీనితో తన సినిమాలు మార్కెట్ ఒకింత అంతంత మాత్రం గానే కనిపిస్తుండగా ఆ ప్లాప్ సినిమాల ఎఫెక్ట్ తో మెగాస్టార్ తాను కూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేశారు.

ఇలా దాదాపు నెక్స్ట్ మూడు సినిమాలూ తాను స్ట్రైట్ సినిమాలు మాత్రమే చేస్తుండగా వాటిలో అన్నింటిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ లైనప్ లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేయనున్న సినిమా కూడా ఒకటి. కాగా ఈ కాంబినేషన్ లో తమకి మొదటి సినిమా కాగా ఇపుడు దర్శకుడు ఈ సినిమా స్క్రిప్ట్ ని తాను షేప్ అవుట్ చేస్తున్నారు.
కాగా ఇపుడు ఓ క్రేజీ రూమర్ ఇపుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అనీల్ లాస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం లో ఇద్దరు హీరోయిన్స్ వెంకీ మామ సరసన ఇద్దరు బ్యూటీలు మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ లు రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ హీరోయిన్స్ లో ఇపుడు ఒకరు మెగాస్టార్ తో నెక్స్ట్ సినిమాలో రొమాన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

అనీల్ కూడా మీనాక్షి లేదా ఐశ్వర్య రాజేష్ లలో ఎవరు బాగుంటారు చిరు పక్కన అనేది చూస్తున్నారట. కాగా దాదాపు ఐశ్వర్య రాజేష్ పేరు చిరు సరసన లాక్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి. అయితే మరోపక్క ఒకవేళ హీరోయిన్ ఉన్నప్పటికీ అనీల్ రావిపూడి తన మార్క్ కామెడీ సీన్స్ లాంటివి మాత్రమే ప్లాన్ చేస్తున్నారు కానీ రొమాంటిక్ సాంగ్స్ లాంటివి మాత్రం పెట్టాలి అనుకోవడం లేదట.
సో చిరు సరసన ఏ యంగ్ హీరోయిన్ ఉన్నా కూడా అలాంటి ట్రాక్ లు మాత్రం చాలా లిమిటెడ్ గానే ఉంటాయని తెలుస్తుంది. సో మెగాస్టార్ నుంచి ఈ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పక్కన పెడితే దీనికి ముందు రావాల్సిన విశ్వంభర పరిస్థితి మాత్రం కొంచెం కన్ఫ్యుజింగ్ గానే ఉంది.


Click it and Unblock the Notifications











