Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజకు తిక్క రేగింది...కమిటయ్యాడు
హైదరాబాద్ : అవును రవితేజకు తిక్క రేగింది. అదేంటో రోజు రోజుకీ రవితేజలో గ్లామర్ పెరుగుతోంది. అలాగే ఆయన తన వయస్సుని ప్రక్కన పెట్టి కెరీర్ ని మరింత స్పీడు చేస్తున్నారు . ప్రస్తుతం కిక్-2, బెంగాల్ టైగర్ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రామ్ తో కందిరీగ చిత్రం తీసి హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనునున్నారని సమాచారం. రవితేజ శైలికి సరిపోయే మాస్ ఎంటర్టైనర్ను ఆయన కోసం శ్రీనివాస్ సిద్ధం చేసినట్లు తెలిసింది. కొత్త తరహా అంశాలను మేళవించి రూపొందించిన ఈ చిత్ర కథ, కథనాలు ఆకట్టుకోవటంతో రవితేజ ఈ సినిమాకు అంగీకారం చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు తిక్క రేగింది అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది.
యాక్షన్, వినోదం అంశాలకు పెద్దపీట వేస్తూ రూపొందించనున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర చిత్రణ వినూత్నపంథాలో సాగనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. డి.వి.వి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఎన్టీఆర్ తో చేసిన రభస చిత్రం ఫెయిల్యూర్ కావటంతో సంతోష్ శ్రీనివాస్ ..గ్యాప్ తీసుకుని ఈ సారి మరింత పగడ్బందీగా కథ,కథనాలు అల్లుకున్నారు. రభస హిట్టై ఉంటే అల్లు అర్జున్ తో చిత్రం ఉంటుందని అంతా భావించారు. అయితే ఆ డిజాస్టర్ ఎఫెక్టు ..అతని సినిమాపై పడింది. అయితే ఈ సారి రవితేజ తో చేసే కథ మాత్రం మళ్లీ ఫామ్ లోకి తెచ్చేలా కొత్త తరహాలో వండినట్లు చెప్పుకుంటున్నారు.
ఇక రవితేజ తాజా చిత్రం కిక్ 2 విషయానికి వస్తే...
రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ కిక్ టీమ్ తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్-2'. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదలై ఇప్పటికే ఆదరణ పొందుతోంది.
రవితేజ,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వంక్కతం వంశీ, సంగీతం: ఎస్ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి