'తిక్క రేగితే' బన్నీనా, రవితేజనా?

By Srikanya

హైదరాబాద్: తిక్కరేగితే నేను మామూలు మనిషిని కాదు అంటూంటారు. ఇప్పుడు అదే (తిక్క రేగితే) టైటిల్ తో ఓ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నారు కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రవితేజ గానీ బన్నీ గానీ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని ఓ పెద్ద బ్యానర్ వారు చేయనున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో రభస షూటింగ్ ఫినిష్ చేసుకుని, దానికి తుది మెరుగులు దిద్దుతున్న సంతోష్ శ్రీనివాస్... ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో బయిట నుంచి వరస ఆఫర్స్ వస్తున్నాయి. రవితేజ సైతం ఈ దర్శకుడుతో చేయటానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు.

ఎన్టీఆర్‌ అంటే కావల్సినంత మాస్‌.. కళ్లు చెదిరే యాక్షన్‌! ఎప్పుడు చూసినా... బాగా మందు దట్టించిన సీమ టపాసులా ఉంటాడు. కనుసైగతో సెగలు పుట్టిస్తాడు. మీసం మెలేస్తే... ప్రత్యర్థులకు ఇక గుబులే. 'అమ్మతోడు... అడ్డంగా నరికేస్తా'. 'బుడ్డోడూ బుడ్డోడూ అంటే గుడ్డలూడదీసి కొడతా..' - ఎన్టీఆర్‌ ఫోర్స్‌తో చెబుతున్న డైలాగులు వింటుంటే అభిమానుల గుండెల్లో కేరింతలే!

Santosh Srinivas saying Thikka Regithe

ఎన్టీఆర్‌ని అలా చూడ్డమే అభిమానులకు ఇష్టం. అందుకే అభిమానుల ఆశలకు అనుగుణంగా తనని తాను మార్చుకొంటుంటాడు. అయితే... అభిమానులనే కాదు, అందరినీ మెప్పించాలన్న తాపత్రయం మాత్రం మెండు. అందుకే ఎన్టీఆర్‌ సినిమాలు సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ఉంటాయ్‌. 'రభస' కూడా అందుకు మినహాయింపు కాదట. ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం కోరుకొంటారో.. అవన్నీ మా సినిమాలో ఉన్నాయని చెబుతోంది చిత్రబృందం.

మే 20.... ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా 'రభస' ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అందులో ఎన్టీఆర్‌ స్త్టెలింగ్‌ చూసి అభిమానులు ముచ్చటపడుతున్నారు. టీజర్‌లోనూ యాక్షన్‌ బాగా దట్టించారు. 'కందిరీగ'తో హిట్‌ కొట్టిన సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌తో 'ఆది'లాంటి సూపర్‌హిట్‌ సినిమా తీసిన బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. ఆగస్టు 14న 'రభస'ని విడుదల చేయబోతున్నారు.

''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా విందు భోజనంలా ఉంటుంది. ఎన్టీఆర్‌ గురించి చాలాసార్లు విన్నా. ఆయన్ని దగ్గరుండి చూస్తుంటే, ఆయనతో పనిచేస్తుంటే రియల్‌ హీరో.. ఎన్టీఆర్‌ అనిపిస్తోంది. ఆయన నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకొంటా'' అంటున్నారు దర్శకుడు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్‌, తమన్‌ల కలయికలో వచ్చిన 'బాద్‌షా', 'బృందావనం' పాటలు మాస్‌కి బాగా ఎక్కేశాయి. ఈసారీ తమన్‌ పాటలు అలరించడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X