»   » పాపం... స్టార్ హీరో కూతురు కోసం ఆమెకు అన్యాయం చేసారే? (ఫోటోస్)

పాపం... స్టార్ హీరో కూతురు కోసం ఆమెకు అన్యాయం చేసారే? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, వారి ఫ్యామిలీ ఆధిపత్యం ఎంత బలంగా ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. తమ వారిని ఇండస్ట్రీలో నిలబెట్టడం కోసం వారు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారు అప్పుడప్పుడు అన్యాయానికి గురి కావడం, అకాశాలు కోల్పోడం లాంటి జరుగుతుండటం సర్వసాధారణం.

తాజాగా బాలీవుడ్లో ఇలాంటి సంగఘటనే చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తున్న వేళ మరో హీరోయిన్ కు అన్యాయం చేసారు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' చిత్రానికి సీక్వెల్‌ తీసేందుకు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌జోహర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అతడి సరసన తొలుత ఈ చిత్రంలో దిశా పటానిని అనుకున్నారు. అయితే సైఫ్ తన కూతురు సారా అలీ ఖాన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తానని ముందుకు రావడంతో దిశా పటానిని పక్కకు తప్పించారు.

ఖరారు చేసిన ధర్మ ప్రొడక్షన్స్

ఖరారు చేసిన ధర్మ ప్రొడక్షన్స్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్లు, ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడని, ఈ చిత్రం ద్వారా సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోందని ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ధృవీకరించింది.

సైఫ్‌ అలీఖాన్‌ సైతం

సైఫ్‌ అలీఖాన్‌ సైతం

సైఫ్‌ అలీఖాన్‌ సైతం తన కుమార్తె కరణ్‌జోహార్‌తో కలిసి చిత్రం చేయనున్నట్లు ‘రంగూన్‌' చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా మీడియాకు తెలిపారు. సారా తన కెరీర్‌ను సినీ రంగంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

సెక్సీలుక్సీ లుక్ లోకి మారిన సారా

సెక్సీలుక్సీ లుక్ లోకి మారిన సారా

సంవత్సర కాలం కిత్రం వరకు లావుగా ఉన్న సారా అలీ ఖాన్.... ఇపుడు సెక్సీ లుక్ కోసం చాలా కష్టపడి సన్నబడింది. ఆమె ఫోటోలు చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

సారా అలీఖాన్... అతడితో ముద్దులు, సరసాలు: ఫోటోలు లీక్

సారా అలీఖాన్... అతడితో ముద్దులు, సరసాలు: ఫోటోలు లీక్

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలు రహస్యంగా చేస్తున్న పనులు కొన్ని సోషల్ మీడియా పుణ్యమా అని బయటకు లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. సారా అలీ ఖాన్ విషయంలో కూడా అలా జరిగింది. ఆ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Sara Ali Khan to be launched opposite Tiger Shroff in Student of The Year 2. Ali Khan will make her Bollywood debut with Dharma Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu