యంగ్ హీరోతో సారా టెండ్కూలర్ డేటింగ్.. ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఎవరతను?
సారా టెండూల్కర్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండ్కూలర్ కూతురిగా అందరికి సుపరిచితురాలే. ఈ స్టార్ కిడ్ సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తూ ఉంటుంది. పబ్లిక్ అప్పీయరెన్స్ తోనూ అందరి అటెన్షన్ ను డ్రా చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. సారా టెండ్కూలర్ ప్రస్తుతం మరోక యంగ్ స్టార్ తో ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. ఇంతకీ సచ్చిన టెండ్కూలర్ కూతురు ఎవరి ప్రేమలో పడిందనే విషయానికొస్తే..
సచ్చిన్ టెండ్కూలర్ కూతురి గురించి..
క్రికెట్ లెజెండ్ సచ్చిన్ టెండ్కూలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగానూ నిలిచారు మాస్టర్ బ్లాస్టర్. ఇక ప్రస్తుతం ఆయన కొడుకు అర్జున్ కపూర్ క్రీడా మైదానంలో ఆకట్టుకుంటున్నారు. ఇక ఆయన కూతురే సారా టెండూల్కర్. ఈమె 1997 అక్టోబర్ 12న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 27 ఏళ్లు. ఈమె సచ్చిన్ : బిలియన్ డ్రీమ్స్ అనే డాక్యుమెంటరీలో ఒక చిన్న పాత్ర పోషించింది. ధీరూ భాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూ ల్, లండన్ లోని యూనివర్సీటీ కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది.

సారా టెండ్కూలర్ డేటింగ్ రూమర్లు..
సారా టెండ్కూలర్ కొంత కాలంగా ఇండియన్ క్రికెటర్ శుభమన్ గిల్ తో డేటింగ్ లో ఉందంటూ ప్రచారం జరిగింది. తనకంటే వయస్సులో ఐదేళ్లు పెద్దవాడైన శుభమన్ గిల్ తో సారా టెండ్కూలర్ ప్రేమ వ్యవహరం నడిపించిందని, ఆ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా పరోక్షం తెలియజేసిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఇక ఇటీవల ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడంతో వారి ప్రేమ వ్యవహరానికి ముగింపు పలికారని, బ్రేకప్ చెప్పుకున్నారని మళ్లీ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడిందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
సారాతో డేటింగ్ లో ఉన్న యంగ్ హీరో ఎవరు?
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో సారా టెండూల్కర్ కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తుందంటూ బాలీవుడ్ మీడియా కోడె కూస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతానికి సిద్ధాంత్ చతుర్వేది సారా టెండూల్కర్ స్నేహితులుగానే కనిపిస్తున్నారని, కానీ ఒకరితో మరొకరు ఉండే తీరు వారి అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లుందని వివరిస్తున్నారు. ఒకరి అభిప్రాయలను మరొకరు ఇష్టపడుతూ ఉన్నారని సమాచారం ఉందంటున్నారు. తర్వలోనే అధికారికంగా వారి రిలేషన్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ కథనాలు తెలుపుతున్నాయి.
సిద్ధాంత్ చతుర్వేది సినిమాలు..
బాలీవుడ్ లో యంగ్ హీరోగా సిద్ధాంత్ చతుర్వేది మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. గల్లీ బాయ్, బంటీ ఔర్ బబ్లీ 2, గెహ్రయియా, ఫోన్ భూత్ వంటి గుర్తుండి పోయే చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలతో క్రేజీ నటుడిగా మారిపోయాడు. ప్రస్తుతం దఢక్ 2, దిల్ కా దర్వాజా ఖోలో నా డార్లింగ్.. వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











