వంశీ 'సరదాగా కాస్సేపు' చిత్రం ప్రియదర్శన్ చిత్రం కాపీ?

By Srikanya

ఈ శుక్రవారం విడుదలైన సరదాగా కాస్సేపు చిత్రం 1986 లో వచ్చిన ఓ మళయాళ చిత్రం కాపీ అని తెలుస్తోంది. మోహన్ లాల్, లిజీ,శ్రీనివాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం టైటిల్ 'Mazha Peyyunnu Maddalam Kottunnu'. ఈ చిత్రం కథ సరదాగా కాస్సేపు ప్లాట్ ఒకటే. అలాగే చాలా సన్నివేశాలు,పాత్రలు ఒకటే కావటం కూడా విశేషం. ఇక ఈ చిత్రాన్ని అక్కడ కామిడీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్ డైరక్ట్ చేసారు. ఎప్పుడూ కాపీ కొట్టనని,కొట్టరని పేరున్న వంశీ ఈ పని చేసారంటే నమ్మలేని విషయం. అలాగే టైటిల్స్ లో కథ..రేలంగి నరసింహరావు పేరు వేసారు కాబట్టి ఆ కాపీ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. గతంలో కూడా వంశీ...ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..కథని ట్రంప్ కార్డు అనే నవల నుంచి సంగ్రహించారని కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఆ కథకు కూడా క్రెడిట్ గంగోత్రి విశ్వనాధ్ పేరు వేసారు వంశీ. ఇక అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం వంశీ అభిమానలుకు కూడా నచ్చటం లేదు. ఇక ఈ చిత్రం సరదాగా కాస్సేపు ఒకటా కాదా అన్న అనుమానం తీర్చుకోవటానికి యు ట్యూబ్ ని ఆశ్రయించవచ్చు. యూ ట్యూబ్ లో ఈ చిత్రానికి సంభందించి చాలా క్లిప్ లు ఉన్నాయి. చూసి సీన్స్ ని పోల్చుకోండి. అదీ విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X