నాగచైతన్యతో శరత్ కుమార్ కూతురు?

ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నటించబోయే చిత్రానికి 'యజ్ఞం ', 'వీర భద్ర' ఫేం రవికుమార్ చౌదర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











