twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్యతో శరత్ కుమార్ కూతురు?

    By Bojja Kumar
    |

    నాగచైతన్య, రాధామోహన్ దర్శకత్వంలో త్వరలో 'గౌరవం' అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది. వరలక్ష్మి ఇప్పటికే తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయి నటన, అందం విషయంలో మంచి మార్కులే కొట్టేసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు, తమిళం రెండు భాషల్లోనే నాగచైతన్య గౌరవం చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నటించబోయే చిత్రానికి 'యజ్ఞం ', 'వీర భద్ర' ఫేం రవికుమార్ చౌదర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    English summary
    We already known that Naga Chaitanya has signed a Bilingual project titled Gouravam with critically acclaimed director Radha Mohan.Latest news is that Tamil star actor Sarath Kumar's daughter Varalakshmi is in the news currently as the female lead opposite Naga Chaitanya this new movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X