దీపావళికి దిగుతున్న సీనియర్ హీరోయిన్.. ఇప్పటికే లేటయింది.. ఇక సంచలనాలే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తోంది విజయశాంతి. దీంతో మరోసారి వెండితెరపై ఈమె రూపం చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షకలోకం.

2006 సంవత్సరంలో చివరిసారిగా వెండితెరపై మెరిసింది విజయశాంతి. 'నాయుడమ్మ' సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ చచ్చింది. మళ్లీ ఇంత కాలానికి తిరిగి వెండితెర గడప తొక్కడం, పైగా పవర్‌ఫుల్ రోల్ పోషించడం కారణంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఈమె లుక్ ఎలా ఉంటుందనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొంది.

SariLeru Neekevvaru Diwali Treat Confirmed

అయితే అందరి ఆసక్తిని తెరదించే సమయం వచ్చేసిందనే వార్త సూపర్ స్టార్ అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులను ఆనంద పరుస్తోంది. దీపావళి కానుకగా, పండగ రోజున విజయశాంతి ఫస్టులుక్ విడుదల చేయబోతున్నారని సమాచారం. దీంతో ఈ దీపావళి తమకెంతో స్పెషల్ కానుందని, విజయశాంతి దిగుతోందని చెప్పుకుంటున్నారు ఆమె అభిమానులు. ఇప్పటికే లేటయింది.. ఇక సంచలనాలే..! అని కూడా అంటున్నారు.

అనిల్ రావిపూడి రూపొందిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో మరోసారి మహేష్ బాబు కామెడీ ఎపిసోడ్ చూడాలని ఆతృతగా ఉంది ప్రేక్షకలోకం. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X