ఇన్‌సైడ్ టాక్.. అనిల్ రావిపూడి అసంతృప్తి.. ఇదీ 'సరిలేరు నీకెవ్వరు' ఇష్యూ!

వరుస హిట్లతో మంచి దూకుడుమీదున్నాడు మహేష్ బాబు. ఇటీవలే మహర్షి సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో తన 26వ సినిమాను అనిల్ రావిపూడితో కమిటయ్యారు. 'సరిలేరు నీకెవ్వరు' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ విషయమై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా అసంతృప్తి? వివరాలు చుస్తే..

పవర్‌ఫుల్ స్క్రిప్ట్.. భారీ హంగులు

పవర్‌ఫుల్ స్క్రిప్ట్.. భారీ హంగులు

కామెడీ, ఎమోషన్, ఫన్ అన్నీ కలగలుపుతూ సరిలేరు నీకెవ్వరు స్క్రిప్ట్ రెడీ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాను రాసుకున్న ఆ స్క్రిప్ట్‌ని ఎంతో జాగ్రత్తగా అన్ని హంగులతో తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో చిత్ర సంగీత దర్శకుడి విషయమై అనిల్ రావిపూడి సంతృప్తి చెందడం లేదనేది ఇన్‌సైడ్ టాక్.

 సరిలేరు నీకెవ్వరు దేవీ శ్రీ ప్రసాద్

సరిలేరు నీకెవ్వరు దేవీ శ్రీ ప్రసాద్

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సాధారణం గానే దేవీ శ్రీ బాణీలు ఉర్రూతలూగిస్తుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్ వెతుకుతూ సరికొత్త వినసొంపైన సంగీతం అందించడంలో దేవీ శ్రీ దిట్ట. అలాంటి ఈయన సంగీత సారథ్యంపై అనిల్ రావిపూడి అసంతృప్తిగా ఉన్నారనే వార్త సంచలనం అవుతోంది.

అసంతృప్తికి అసలు కారణం ఇదే..

అసంతృప్తికి అసలు కారణం ఇదే..

కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాకు పాటలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయట. ఈ సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా నటిస్తోంది. అలాగే విజయశాంతిపై ఓ పాట, రష్మికతో కొన్ని పాటలు మరింత కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేశారట అనిల్. కానీ ఈ పాటలకు ట్యూన్ అందించడంలో దేవీ శ్రీ జాప్యం చేస్తుండటం ఆయనకు చిరాకు తెప్పిస్తోందని సమాచారం.

 మహేష్ అలా.. విజయశాంతి స్లిమ్ లుక్

మహేష్ అలా.. విజయశాంతి స్లిమ్ లుక్

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ఫ్రెండ్ యొక్క తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నట్లు సమాచారం. చిత్రంలో విజయశాంతి స్లిమ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

ఈ మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్, నరేష్, సంగీత, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, ప్రదీప్ రావత్, వెన్నెల కిషోర్, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 12, 2020న ఈ సినిమాను విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X