అట్టహాసంగా 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీ స్కెచ్.. మహేష్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే సినిమా ప్రమోషన్స్ దిశగా అడుగులేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసేసిందని తెలుస్తోంది.
జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానున్న నేపథ్యంలో జనవరి 5 వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా అట్టహాసంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని మహేష్ బాబు భావిస్తున్నట్లుగా ఇన్ సైడ్ టాక్. ముఖ్య అతిధిగా కూడా ఓ స్టార్ హీరోను ఆహ్వానించాలని చూస్తున్నారట. అతి త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనుందట 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్.

మహేష్ బాబు కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. డిసెంబర్ నుండి ప్రమోషన్స్ వేగవంతం చేసే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు టైటిల్ ట్రాక్ మాత్రమే విడుదలైంది. మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలోనే విడుదల కాబోతున్నాయట. చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











