Just In
- 49 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ప్లాన్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ ఎలా ఉండనుందంటే!
మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఆయన కెరీర్‌లో 26వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ తీసుకురావడంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. వివరాల్లోకి పోతే..

మహేష్ బాబు సలహా.. ఇన్‌సైడ్ టాక్
జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానున్న నేపథ్యంలో జనవరి 5వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా అట్టహాసంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని మహేష్ బాబు చెప్పారని ఇన్‌సైడ్ టాక్. ముఖ్య అతిధిగా కూడా ఓ స్టార్ హీరోను ఆహ్వానించాలని చూస్తున్నారట.

మహేష్ బాబు కెరీర్ లోనే ఘనమైన ఈవెంట్
మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ఘనంగా జరిగింది 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసి సందడి చేశారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.

'మహర్షి' సమయంలో అనుకున్నారు కానీ..
ఆ తర్వాత మహేష్ కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి' సినిమా సమయంలో కూడా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఈ ఈవెంట్ 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మించి జరగలేదు. అందుకే ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈవెంట్ సర్వ హంగులతో చేయాలని భావిస్తున్నారట.

పబ్లిక్ ఈవెంట్.. లక్షలాది అభిమానుల సమక్షంలో
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయట. పబ్లిక్ ఈవెంట్ గా నిర్వహించి లక్షలాది అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగాలని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు అందుకు తగిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

'సరిలేరు నీకెవ్వరు' మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.