‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి జగపతి బాబు ఔట్?
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా విజయశాంతి, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ షాకింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి జగపతి బాబు తప్పుకున్నారట. అయితే ఉన్నట్టుండి ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటనే విషయం తెలియరాలేదు. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

కాగా... జగపతి బాబు స్థానంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత ఇలాంటి కీలక మార్పులు జరుగడం చర్చనీయాంశం అయింది. త్వరలోనే దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ వెల్లడి కానుంది.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం చిత్రం ద్వారా రష్మిక మందన్న తొలిసారి మహేష్ బాబుతో చేసే అవకాశం దక్కించుకున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. హీరో ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











