Just In
- 7 min ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 10 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 11 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్కారు వారి పాట.. మరోసారి మార్చక తప్పట్లేదు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ అనుకోకుండా క్యాన్సిల్ అయ్యింది. ఇక డిఫరెంట్ కథలు ఎన్నో విన్న మహేష్ ఫైనల్ గా గీత గోవిందం దర్శకుడిని లైన్ లో పెట్టి సర్కారు వారి పాట సినిమాను రెడీ చేయించుకున్నాడు.
అయితే మధ్యలో కరోనా వచ్చి ఒక్కసారిగా ప్లాన్ చేంజ్ చేసింది. ఒక విధంగా దర్శకుడు పరశురామ్ కథను మరింత డెవలప్ చేసి షెడ్యూల్ ప్లానింగ్ ను సెట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా షెడ్యూల్స్ విషయంలో ఇప్పుడు చిత్ర యూనిట్ మరోసారి మార్పులు చేయక తప్పడం లేదు. అసలైతే మొదట యూఎస్ లోనే ఒక షెడ్యూల్ ని ఫినిష్ చెయ్యాలి. కానీ అనుకోకుండా అది కూడా క్యాన్సిల్ అయ్యింది.

ఇక సరికొత్తగా హైదరాబాద్ లో అనుకున్న మరొక కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ కొత్త ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ ముందుగానే సెట్స్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. లాక్ డౌన్ లోనే ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్ గా రెడీ చేసుకున్నాడు.
అనుకోకుండా ఒక షెడ్యూల్ క్యాన్సిల్ అయినా కూడా వెంటనే మరో ఎపిసోడ్స్ ని షూట్ చేసుకునేలా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ షెడ్యూల్ ని ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవచ్చని దాని తరువాత జరగాల్సిన సీన్స్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్న విషయం తెలిసిందే.