RC15: రామ్ చరణ్ మూవీకి వినూత్న టైటిల్.. శంకర్ సూపర్ ఐడియా.. ఆరోజే టైటిల్ పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న అతడు.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే భారీ భారీ చిత్రాల్లో భాగం అవుతున్నాడు.
ఇలా ప్రస్తుతం రెండు బిగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకున్న మెగా హీరో.. ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి వినూత్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా టైటిల్? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

రెండింటిని పూర్తి చేసిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రుధిరం రణం)లో నటించాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా నటించాడు. భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో చరణ్ అల్లూరిగా, తారక్ కొమరం భీంగా నటించారు. దీనితో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య'లోనూ ఈ మెగా హీరో భాగం అయిన విషయం తెలిసిందే.

లెజెండరీ డైరెక్టర్‌తో క్రేజీ మూవీ
రెండు సినిమాలు విడుదల కాకముందే రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి చాలా కాలం పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు కూడా తెరపైకొచ్చాయి. కానీ, ఊహించని విధంగా అతడు.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. భారీగా రాబోయే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

గతంలో కనిపించనంత వేగంగా
సాధారణంగా దర్శకుడు శంకర్ సినిమా పూర్తవడానికి చాలా కాలం పడుతుంది. అయితే, చరణ్‌తో చేసే సినిమా కోసం మాత్రం ఆయన ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రారంభానికి ముందే కాస్టింగ్‌ను కూడా కంప్లీట్ చేశారు. ఇలా ఇప్పటికే దీని కోసం జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి వాళ్లను ఎంపిక చేశారు. అలాగే, టెక్నికల్ టీమ్‌నూ రెడీ చేశారు.

గ్రాండ్ స్టార్ట్.. చాలా వరకు పూర్తి
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇది నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

వార్నింగ్ ఇచ్చినా అన్నీ రివీల్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు ముందే లీక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే ‘ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని వార్నింగ్ ఇచ్చింది. అయినా లీకులు ఆగడం లేదు.

చరణ్ - శంకర్ సినిమా టైటిల్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ భారీ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ టైటిల్ గురించి కూడా చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా రామ్ చరణ్ - శంకర్ కలయికలో రాబోతున్న ఈ చిత్రానికి ‘సర్కారోడు' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.
Recommended Video

ఆరోజే టైటిల్ పోస్టర్ విడుదల
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘సర్కారోడు' అనే టైటిల్‌నే చిత్ర యూనిట్ రిజిస్టర్ చేయించిందట. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. తమిళంలోనూ ఇదే అర్థం వచ్చేలా పేరు పెట్టబోతున్నారట. దీంతో ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











