మహేష్ తరువాత మరో అగ్ర హీరోను లైన్ లో పెడుతున్న పరశురామ్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొంతమంది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్ మామూలుగా లేదు. అలాంటి వారిలో పరశురామ్ కూడా ఇప్పుడు టాప్ లిస్టులో ఉన్నాడు. ఎప్పటి నుంచో స్టార్ హీరోలతో వర్క్ చేయాలని చూస్తున్న ఈ దర్శకుడు మొత్తానికి మహేష్ బాబుతో సినిమాను డైరెక్ట్ చేసి టాప్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇక తదుపరి సినిమాను ముందుగా అనుకున్న హీరోతో చేస్తున్న పరశురామ్ ఆ తరువాత మరో అగ్ర హీరోను కూడా లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

కొంత నెగిటివ్ టాక్..
సర్కారు వారి పాట సినిమాకి కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా పరవాలేదు అనే విధంగానే కలెక్షన్స్ అందుకుంటోంది. ఆదివారం వరకు పరిస్థితి బాగానే ఉంటుందనే నమ్మకం ఉంది. కానీ సోమవారం తరువాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు పరశురామ్ ఒక విదంగా అగ్ర దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నట్లే అని చెప్పవచ్చు. ఇక తన తదుపరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఒక్కసారిగా మారిపోయింది..
అసలైతే దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమా కంటే ముందే నాగచైతన్యతో సినిమా చేయాలి. మైత్రి మూవీ మేకర్స్ లోనే ఆ సినిమా రానుందని అప్పుడు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. కానీ హఠాత్తుగా మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో పరశురామ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సర్కారు వారి పాట కథను మహేష్ కు వినిపించి సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేయించారు.

బన్నీ రిజెక్ట్ చేయడంతో..
మొదట సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరశురామ్ మేయిన్ స్టోరీ లైన్ ను అల్లు అర్జున్ కు వినిపించడం జరిగిందట. అల్లు అరవింద్ కూడా మేయిన్ కథను బాగానే నచ్చినప్పటికి అప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాను లైన్ లో పెట్టడంతో ఆలోచనలు మారిపోయాయి. పాన్ ఇండియా ఫార్మాట్ లో ఆ సినిమా సెట్టవ్వదు అని బన్నీ రిజెక్ట్ చేయడంతో పరశురామ్ మహేష్ కోసం యూ టర్న్ తీసుకున్నాడు.

వారితో మరో సినిమా
మొత్తానికి పరశురామ్ మహేష్ బాబును ఒక అభిమానిగా వెండితెరపై ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సినిమా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక అల్లు అరవింద్ కూడా పరశురామ్ పని తనాన్ని బాగానే మెచ్చుకున్నాడట. అవకాశాలు లేని సమయంలో అల్లు అరవింద్ పరశురామ్ కు మద్దతు ఇచ్చిన విధానం అంతా ఇంతా కాదు. ఆ కృతజ్ఞతతోనే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో మరో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట.

ఆ హీరో కోసం..?
అల్లు అర్జున్ కోసం దర్శకుడు పరశురామ్ మరొక కథపై కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ అయితే వస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా కథల కోసం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ సమయంలో పరశురామ్ ను మెప్పించాలి అంటే అంతకుమించి అనేలా పాన్ ఇండియా కథను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మరి పరశురామ్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











