Sarkaru vaari paata: సినిమా చివరలో మహేష్ బాబు పవర్ఫుల్ డైలాగ్స్.. ఆ వివాదంపై పంచ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. పరశురామ్ వంటి కమర్షియల్ మాస్ దర్శకుడితో మొదటిసారి చేస్తున్న మహేష్ బాబు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ గెటప్ లతో కనిపిస్తున్న ఈ సూపర్ స్టార్ డైలాగ్స్ తో కూడా ఆకట్టుకుంటాడని ఒక టాక్ అయితే వస్తోంది. గతంలో మహేష్ బాబు క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎంతగానో ఆలోచింపజేసేలా తన నటనతో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ డైలాగ్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యోయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా మొత్తం ఒకలా ఉంటే క్లైమాక్స్ మరొక లెవెల్లో ఉంటుంది. ఇక పూరి జగన్నాథ్ శిష్యుడు అయినటువంటి పరశురామ్ కూడా మహేష్ బాబు కోసం అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ రాసినట్లు తెలుస్తోంది.

రైటర్ గా కూడా మంచి గుర్తింపును అందుకున్నటువంటి పరుశురాం మొదటి సారి ఒక పెద్ద స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం సినిమా తర్వాత అసలైతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నాగచైతన్యతోనే సినిమా చేయాల్సింది. కానీ ఆ తర్వాత మహేష్ బాబు స్వయంగా ఒక సినిమా చేయాలని అడగడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాగ చైతన్యను ఒప్పించి మరి మహేష్ బాబు ప్రాజెక్టును రెండు మూడు నెలల్లోనే సెట్ చేసుకున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో మంచి కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు చొక్కాలు క్చింపుకునేలా ఉంటుందని ఇదివరకే దర్శకుడు చాలా బలంగా క్లారిటీ ఇచ్చాడు.

Sarkaru vaari paata mahesh babu powerful dialouges in climax

ఈ చిత్రం బ్యాంక్ మోసాలు మరియు ఆర్థిక మోసాల చుట్టూ తిరుగుతుందని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. ఇక విజయ్ మాల్యా, నిరవ్ మోడీ వంటి వారి మోసాలను కూడా ఉదాహరణగా చూపిస్తారట. అయితే ఆ ఎపిసోడ్‌లతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో జరిగిన కొన్ని సంచలన బ్యాంక్ మోసాలను కూడా సినిమాలో హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా యొక్క క్లైమాక్స్‌లో మహేష్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్‌లు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయట.

రచయిత-దర్శకుడు పరశురామ్ సమాజంలోని ధనికులు, పేద వర్గాల విభజనపై కొన్ని పంచ్ డైలాగ్స్ ను కూడా అద్భుతంగా రాశాడట. మరి మొత్తం సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మొదటి సారి మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక సుబ్బరాజు, వెన్నెల కిషోర్ వంటి వారు కూడా ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X