Sarkaru Vaari Paata: సంక్రాంతి ఫైట్ నుంచి తప్పుకుంటున్న మహేష్ బాబు.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి అంటే బాక్సాఫీస్ రికార్డులు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. ఈ పండగ సీజన్లో వచ్చే సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతుంది. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాలను చూసేందుకు ఎగబడుతూ ఉంటారు. అందుకే మహేష్ బాబు ప్రతి సారి ఏదో ఒక సినిమాతో సంక్రాంతి పోటీలో పాల్గొంటు ఉంటాడు. ఇక వచ్చే సంక్రాంతికి సర్కారు వారి పాటను అదే తరహాలో విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ పొంగల్ బరిలో పోటీ ఎక్కువ కావడంతో రిస్క్ చేయకూడదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో కొత్త రిలీజ్ డేట్ పై కూడా ఫోకస్ చేసినట్లు సమాచారం.

సంక్రాంతి సెంటిమెంట్ సక్సెస్
మహేష్ బాబు 2020లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొదట్లో కొంత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలో కామెడీ వర్కవుట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. మొత్తానికి సంక్రాంతి సెంటిమెంట్ ను మరోసారి మహేష్ సక్సెస్ అయ్యేలా చేశాడు. ఇక 2021లో ని సర్కారు వారి పాట సినిమా తో రావాలని అనుకున్నాడు కానీ అది కరోనా కారణంగా వర్కవుట్ కాలేదు.

పెద్ద సినిమాల బాక్సాఫీస్ ఫైట్
ఇక ఎలాగైనా 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమాలు విడుదల చేయాలని ఎంతగానో ప్రణాళికలు రచించాడు. అందరికంటే ముందుగానే మహేష్ విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ మిగతా హీరోలు ఎవరూ కూడా మహేష్ సినిమా ఉందని కూడా ఆలోచించలేదు. భీమ్లా నాయక్ జనవరి 12 వ తేదీన రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అంతకంటే ముందు RRR సినిమా జనవరి 7న రాబోతోంది. ఈ సినిమాల తర్వాత రాధేశ్యామ్ జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

సమ్మర్ లో న్యూ డేట్..
సర్కారు వారి పాట సినిమాను జనవరి 13న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అంత కంటే ముందు.. ఆ తరువాత పెద్ద సినిమాలు ఎక్కువ విడుదల అవుతుండడంతో మహేష్ రిస్కు చేయకూడదు అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించి సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అది కూడా ఏప్రిల్ నెలలోనే ఎలాంటి పోటీ లేని సమయంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

రిస్క్ చేయకూడదని..
అయితే సర్కారు వారి పాట సినిమా కమర్షియల్ అంశాలతో లోనే కాకుండా మంచి సందేశంతో కూడా తెరకెక్కుతోంది. దర్శకుడు పరశురామ్ గీత గోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా అంచనాలు ఉంటాయి. సంక్రాంతికి ఈ సినిమా పర్ఫెక్ట్ అని చాలామంది అనుకున్నారు. కానీ నిర్మాతలు మహేష్ బాబు మాత్రం రిస్క్ చేయకూడదని సినిమాను వాయిదా వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా క్లారిటీ గా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











