సర్కారు వారి పాటకు రూ.35కోట్ల ఆఫర్.. షూటింగ్ మొదలవ్వకముందే మహేష్ హవా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది. వీలైనంత వరకు మహేష్ ప్రయోగాలకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నాడు
సేఫ్ జోన్ లో కమర్షియల్ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. లాభాలు ఎక్కువగా రాకపోయినా కూడా పరవాలేదు గాని నష్టాలు రాకూడదని మహేష్ ఎక్కువగా ఆలోచిస్తుంటాడు.

భాషతో సంభంధం లేకుండా

భాషతో సంభంధం లేకుండా

ఇక మహేష్ బాబుకి ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ దక్కుతోంది. భాషతో సంభంధం లేకుండా నార్త్ ఆడియెన్స్ తమిళ్ ఆడియెన్స్ కూడా మహేష్ సినిమాలను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ రాబోతున్న సర్కారు వారి పాట సినిమాపై కూడా అన్ని వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

షూటింగ్ మొదలవ్వకముందే భారీ ఆఫర్

షూటింగ్ మొదలవ్వకముందే భారీ ఆఫర్

గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈపాటికె సినిమా షూటింగ్ సగం పూర్తయ్యేది. కానీ షూటింగ్ ని వాయిదా వేయక తప్పలేదు. ఇక షూటింగ్ మొదలవ్వకముందే సినిమాకు మంచి ఆఫర్ వచ్చింది. దాదాపు రూ.35కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్

శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్

సర్కారు వారి పాట శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా 35కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందట. సినిమా కనీసం షెడ్యూల్ ప్లాన్ కూడా ఫైనల్ చేసుకోకముందే ఈ రేంజ్ లో ఆఫర్ రావడం గొప్ప విషయమనే చెప్పాలి. అయితే ఇంకా ఈ ఆఫర్ కి చిత్ర నిర్మాతలు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై చర్చలు గట్టిగానే జరుగుతున్నాయట.

Recommended Video

#SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

ఈ డీల్ సెట్టయితే త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని అక్టోబర్ నెలలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. కుదరకపోతే నవంబర్ లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఇక సినిమాకు సంబంధించిన ఇద్దరు హీరోయిన్స్ విషయంలో ఇంతవరకు ఫైనల్ క్లారిటీ ఇవ్వలేదు. కీర్తి సురేష్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. ఇక మరో హీరోయిన్ విషయంలో దర్శకుడు తుది నిర్ణయాన్ని తీసుకోలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X