‘సర్కారు వారి పాట’ నుంచి షాకింగ్ అప్‌డేట్: అనివార్య కారణాలతో క్యాన్సిల్.. రిలీజ్ డేట్‌పై ప్రభావం

కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ఆ పరంపరను కొనసాగించేందుకు అతడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైనా.. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఎద అందాల విందు.. రిషికా బాలి పిక్స్ వైరల్

వాళ్లందరితో కలిసి.. ‘సర్కారు వారి పాట'

వాళ్లందరితో కలిసి.. ‘సర్కారు వారి పాట'

పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది 2022 సంక్రాంతికి రానుంది.

మోసం చేసే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు

మోసం చేసే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు

భారీగా అప్పులు తీసుకుని బ్యాంకులను మోసం చేసి పారిపోతోన్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తీస్తున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. కన్నడ పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో జయరాం ఇందులో మహేశ్ తండ్రిగా నటిస్తున్నాడట. హీరో తండ్రిని మోసం చేసి వేరే దేశానికి పారిపోయిన ఓ బడా వ్యాపారవేత్తపై ప్రతీకారం తీర్చుకోవడం అనే కాన్సెప్టుతో ఈ మూవీ రూపొందుతోంది.

రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలయ్యేలా

రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలయ్యేలా

వరుస విజయాలను అందుకుంటోన్న మహేశ్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో అతడి సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. దీంతో 'సర్కారు వారి పాట' నైజాం రైట్స్‌కు డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ హక్కుల కోసం ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించేందుకు పలువురు రెడీ ఉన్నట్లు ఇటీవల ఓ న్యూస్ లీకైంది.

మొదటి షెడ్యూల్ పూర్తి.. అందులో అలా

మొదటి షెడ్యూల్ పూర్తి.. అందులో అలా

గత జనవరిలో దుబాయ్‌లో 'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ జరిగింది. ఇందులో మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. అలాగే, హీరో హీరోయిన్ల కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేశారు. దాదాపు ఇరవై రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌ తర్వాత అక్కడ ప్యాకప్ చెప్పేసింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన అప్‌డేట్లు కూడా ఇచ్చారు.

రెండో షెడ్యూల్‌.. అమెరికా టు దుబాయ్

రెండో షెడ్యూల్‌.. అమెరికా టు దుబాయ్


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్ మార్చి చివరి వారం నుంచి ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని అమెరికాలో ప్లాన్ చేసినా.. అనివార్య కారణాలతో దుబాయ్‌కు మార్చారని ప్రచారం జరిగింది. కానీ, చివరకు గోవాలో దీన్ని ఫిక్స్ చేశారు. అక్కడ పలు పాటలతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని డిసైడ్ అయిపోయారు.

అసలైంది క్యాన్సిల్.. రిలీజ్ డేట్‌పై ఎఫెక్ట్

అసలైంది క్యాన్సిల్.. రిలీజ్ డేట్‌పై ఎఫెక్ట్

తాజా సమాచారం ప్రకారం.. గోవాలో జరగనున్న 'సర్కారు వారి పాట' షెడ్యూల్‌ రద్దైందట. కరోనా ప్రభావం పెరుగుతుండడమే దీనికి కారణం అని తెలుస్తోంది. మరోవైపు, ఈ సినిమాను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని దర్శకుడు పరశురాంకు డెడ్‌లైన్ పెట్టాడట మహేశ్. కానీ, ఇప్పుడు షెడ్యూల్ రద్దు అవడంతో చిత్రీకరణపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న కామెంట్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X