నిత్యామీనన్ కే దిక్కులేదు...హీరోని ఏం ఒడ్డున పడేస్తుంది?

By Srikanya

హైదరాబాద్ : అలా మొదలైంది చిత్రంతో నిత్యామీనన్ కి తెలుగులో వీర క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆమె క్రేజ్ ని సైతం ఓ రేంజిలో క్యాష్ చేసే ప్రయత్నాలు మన దర్శక,నిర్మాతలు చేసేసారు. అయితే ఇప్పుడు భాక్సాఫీస్ వద్ద ఆమె పరిస్ధితి ఏమీ బాగోలేదు. ఆమె నటించిన చిత్రాలు సైతం బిజినెస్ కావటం లేదు. ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి చేసిన మాలిని 22 సైతం తెలుగు రిలీజ్ ...ఎవరూ కొనేవారు లేక ఆగిపోయింది. ఈ నేపధ్యంలో సేమ్ సిట్యువేషన్ లో ఉన్న శర్వానంద్ ఆమెతో జతకట్టాడు. దాంతో వీరి కాంబినేషన్ సినిమాలు అయోమయ పరిస్ధితిని ట్రేడ్ లో ఎదుర్కొంటున్నాయి.

శర్వానంద్ సినిమాలు భాక్సాఫీస్ వద్ద గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నాయి. కో అంటే కోటి, సత్య 2 చిత్రాలు డిజాస్టర్స్ అయిన తర్వాత ఆయన నటించిన ఏమిటో ఈ మాయ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. ప్రముఖ దర్శకుడు చేరన్ డైరక్షన్స్ రూపొందిన ఈ చిత్రం బిజినెస్ సమస్యలతో హార్డ్ డిస్క్ లలోనే ఉండిపోయింది. నిత్యామీనన్ మ్యాజిక్ సైతం ఈ చిత్రం రిలీజ్ కు ఉపయోగపడలేదు. నిత్యామీనన్ నటించిన మాలిని 22 చిత్రం సైతం బిజినెస్ లేక విడుదల కావటం లేదు. అయితే శర్వానంద్ ,నిత్యామీనన్ తో మరో చిత్రం రెడీ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రేమ కావ్యం అని చెప్తున్నారు. దాంతో ఈ చిత్రం అయినా విడుదల అవుద్దా అని కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

Sarwanand and Nitya Menon come together for second time

శర్వానంద్‌, నిత్యమీనన్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎ.వల్లభ నిర్మాత. మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ''శర్వానంద్‌, నిత్యమీనన్‌ల నటన ప్రధానకర్షణగా వస్తున్న అందమైన ప్రేమకథ ఇది. ప్రేమతోపాటు కుటుంబ బంధాలకు చోటుంది'' అన్నారు.

''విశాఖపట్నం, భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిపిన తొలి షెడ్యూల్‌ చిత్రీకరణతో 50 శాతం టాకీ పూర్తయింది. వచ్చే నెల 1 నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాము''అన్నారు చిత్ర సమర్పకులు కె.ఎస్‌.రామారావు. ఈ చిత్రంలో నాజర్‌, పునర్నవి, తేజస్వి, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, కూర్పు: మధుసూదన్‌రెడ్డి, కళ: సాహి సురేష్‌, ఛాయాగ్రహణం: జ్ఞాన శేఖర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X