twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దూకుడు’ చూపించని మహేష్ బాబుపై సెటైర్స్..!?

    By Sindhu
    |

    సూపర్ స్టార్ అందాన్నీ, అభినయాన్నీ పుణికి పుచ్చుకున్న ఆయన తనయుడు మహేష్ బాబు తండ్రి చురుకుదనాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. కృష్ణ ఏడాదికి పది పన్నెండు సినిమాలు చేసిన హీరోగా పేరు తెచ్చుకుంటే… మహేష్ ఏడాదికి ఒక్కటి కూడా చేయలేకపోతున్నాడు. బద్ధకం ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటున్నాడు. స్టార్ట్ చేసిన సినిమాను ఎంతకీ పూర్తిచేయలేకపోతున్నాడు. ఒక సినిమా కంప్లీట్ చేయడానికి మహేష్ కి ఏళ్ళు పడుతోంది.

    ప్రస్తుం శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న 'దూకుడు" సినిమా పరిస్థితి కూడా అలాగే వుంది. సినిమా ప్రారంభించి అప్పుడే చాలా కాలమైనా ఇంకా షూటింగు పూర్తికాలేదు. మామూలుగా తన సినిమాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేసే దర్శకుడు శ్రీను వైట్లకు ఈ పరిస్థితి మింగుడుపడడంలేదని అంటున్నారు. ఇప్పటికింకా నలభై రోజుల వర్క్ మిగిలి వుందని అంటున్నారు. ఈ లెక్కన ఆగష్టులో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యేలా లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

    గచ్చిబౌలీ స్టేడియం నుండి ఈరోజు మద్యహ్నాం నుండి షూటింగ్ ని చార్మినార్ కి షిష్ట్ చేస్తున్నారు..ఇది చాలా పెద్ద షెడ్యూల్ అని సినిమాకి చాలా హైలెట్ అని శ్రీనువైట్ల జూలై రెండవ వారంలోపు షూటింగ్ పూర్తి చేసి ఆగష్టులో సినిమా విడుదలచేయాలని యమ దూకుడుగా పనిచేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

    English summary
    Dookudu with Super Star Mahesh Babu in the lead role directed by Srinu Vytla is being shot at Charminar today morning and would be shifted to Gachibowli from afternoon. Mahesh Babu is shooting for Dookudu in Hyderabad. This is a huge schedule with brief pauses in between.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X