twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు రాజకీయ జీవితం మీద దాసరి సినిమా?

    By Srikanya
    |

    చిరంజీవి, దాసరిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఆ మధ్యన దాసరి ..డైరక్ట్ గా మేస్త్రి అనే వ్యగ్యాత్మక చిత్రం తీసి చిరు మీద డైరక్ట్ సెటైర్స్ వేసారు. ఇప్పుడు మరో వెంచర్ కి దాసరి సిద్దమవుతున్నారు. ఆ సినిమాకి అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ పెట్టినట్లుసమాచారం. ఈ టైటిల్ ని ఆయన చాలా కాలం క్రిందట ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. ఆ సినిమాలో పూర్తిగా చిరు రాజకీయ జీవితం మీద సెటైర్స్ వేయటానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

    ఇక దాసరి మేస్త్రి చిత్రంలో షకీలా రోడ్ షో పెట్టినా చాలామంది చూడ్డానికి వస్తారు..పెద్దవాళ్ళ ఫొటోలు పెట్టుకుంటే మాత్రాన నువ్వేమి పెద్దవాడివి కాదు..అంటూ చిరంజీవి ప్రజారాజ్యంపై సెటైర్స్ వేసారు. అ సినిమాలో విజయ్ కుమార్ పాత్రను చిరుని పోలి ఉండేలా చేసాడు. అందులో ఆ పాత్ర ఓ గాంధీయవాధి..ఓ సెలబ్రేటి..అతనో కొత్త పార్టీ పెడతాడు. వారి ఎజెండా అందరికీ సామాజిక న్యాయం అని ప్రకటిస్తారు. అప్పుడు విలేఖర్లు సామాజిక న్యాయం అంటే ఏమిటీ అని అడుగుతారు. దానికి విజయ్ కుమార్..మేధావులను చర్చకు వేశాం చెప్తాం..అంటూ సమాధానం చెప్తూ నసుగుతాడు.

    అలాగే మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా అని విమర్శలు చేసారు. అలాగే ఓ చోట విజయ్ కుమార్ పాత్రను మీడియా వ్యక్తులు మీ పార్టీ వారు సీట్ కి కోటిరూపాయలు చొప్పున తీసుకుంటున్నారట కదా అని అడుగుతారు.

    ప్రస్తుత సినిమాలో సైతం దాసరి నారాయరావు ఘూటుగానే సెటైర్స్ వేయటానికి మరో సారి తన కలం బలం చూపటానికి రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం స్టోరీ సిట్టిగ్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటివల రాష్ట్రంలో జరిగిన చాలా పరిణామాలను తెరకెక్కిస్తుందని చెప్తున్నారు. అయితే టైటిల్ విషయంలోనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ టైటిల్ ..సెన్సార్ బోర్డ్ వద్ద పాస్ అవుతుందా అని సందేహపడుతున్నారు. దాసరి పరమవీకచక్ర చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని చెప్తున్నారు.

    English summary
    As per the reliable sources, it is learnt that Dasari narayana raois now planning to direct a movie which titled, 'Assembly lo Dongalu Paddaaru.' Long ago, he registered this title at the film chamber. 'Assembly lo Dongalu Paddaru' movie is definitely going to be a satirical film on Chiru's politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X