మహేష్ చిత్రంలో విలన్ గా తమిళ హీరో సత్యరాజ్ ని...
ఎన్నో తమిళ చిత్రాల్లో విలన్ గా వేసిన సత్యరాజ్ త్వరలో మహేష్ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. అలాగే అదే చిత్రంలో ఇలియానాకు తండ్రిగానూ కనిపించనున్నారు. శంకర్ డైరక్షన్ లో రూపొందనున్న ఈ విశేషం చోటు చేసుకోనుంది. బాలీవుడ్ సూపర్ హిట్ త్రీ ఇడియట్ రీమేక్ లో ప్రొఫెసర్ గా చేసిన బొమన్ ఇరానీ పాత్రకు సత్యరాజ్ కమిటయ్యారు. ఆయన చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఇక శంకర్ గతంలో ఆయన్ను తన శివాజీ చిత్రంలో సుమన్ చేసిన విలన్ పాత్రకు అడిగారు. కానీ అప్పట్లో సత్యరాజ్...ఆ పాత్ర నచ్చలేదంటూ వదిలేసారు. అయితే ఈ పాత్ర విని, త్రీ ఇడియట్స్ సినిమా చూసి వెంటనే ఓకే చేసారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చేసిన పాత్రను తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ చేస్తున్నారు.
మహేష్ బాబు త్రీ ఇడియట్స్ విజయ్ శంకర్ రోబో మాధవన్ సత్యరాజ్ mahesh babu 3 idiots vijay shankar robo madavan satya raj


Click it and Unblock the Notifications