విజయ్ దేవరకొండ మూవీలో మరో తెలుగు హీరో.. ఎలాంటి పాత్రను చేస్తున్నాడో తెలిస్తే!
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో ఫుల్ జోష్‌తో మూవీలు చేస్తున్నాడు. కానీ హిట్లు మాత్రం అంతగా రావట్లేదు. అయినా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
టాలీవుడ్ క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ కొద్ది రోజుల క్రితమే 'ది ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది అంచనాలను అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.

గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. అదే సమయంలో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పటి వరకూ ఎవరి పేరు కూడా బయటకు రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో టాలెంటెడ్ తెలుగు హీరో సత్యదేవ్ కూడా నటిస్తున్నాడట.

డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. మరీ ముఖ్యంగా అతడి రోల్ విజయ్ దేవరకొండకు హెల్ప్ చేస్తూనే వెన్నుపోటు పొడిచేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సత్యదేవ్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా భాగం అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడి పాత్రపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











