Viswambhara: చిరంజీవి సినిమాలో సలార్ నటుడు.. ఇందులో కూడా అలాంటి పాత్రలోనే!
తెలుగులో ఇప్పుడు యంగ్ హీరోల కంటే సీనియర్ హీరోలే వేగంగా సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ చిరంజీవిదే. అంతలా ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' మూవీలతో వచ్చి అలరించి.. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు.
'భోళా శంకర్'తో తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారు. ఇందులో భాగంగానే తన 156వ సినిమాను కల్యాణ్ కృష్ణతో ప్రకటించారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. కానీ, ఇప్పుడు ఆయన 'బింబిసార' మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. కాన్సెప్టు పోస్టర్‌లోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆ వెంటనే పూజా కార్యక్రమాలను సైతం జరిపారు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టి.. ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసేశారు.
క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాదు, కొందరు యాక్టర్లను కూడా ఫైనల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కన్నడ నటుడికి అదిరిపోయే రోల్ ఇచ్చినట్లు తెలిసింది.

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ పరిశ్రమకు చెందిన సౌరవ్ లోకేష్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇటీవలే వచ్చిన 'సలార్'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న దొరగా కనిపించిన అతడు.. ఇప్పుడు చిరంజీవి సినిమాలోనూ అలాంటి పాత్రనే చేయబోతున్నాడట. త్వరలోనే ప్రారంభం కాబోతున్న షెడ్యూల్‌లోనే అతడు షూట్‌లో జాయిన్ అవుతాడని సమాచారం. వాస్తవానికి సౌరవ్ గతంలో 'ఆచార్య' సహా పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడు.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి సహా మరికొందరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











