మా మధ్య ఆ రిలేషనే.. క్రికెటర్‌తో అఫైర్ గురించి సవ్యసాచి హీరోయిన్!

By Rajababu

బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌కు క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌కు జబర్దస్త్‌గా అఫైర్ నడస్తున్నదనే రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. గత కొద్దికాలంగా ఆ వార్తలు వైరల్‌గా మారుతున్నప్పటికి వాటిపై ఇద్దరూ స్పందించలేదు. కానీ ఇటీవల అందాల తార నిధి అగర్వాల్ ఎట్టకేలకు తన మధ్య ఉన్న బంధంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. క్రికెటర్ రాహుల్‌తో ఉన్న అనుబంధంపై ఆమె ఏమన్నారంటే..

మీడియాలో గాలి వార్తలు

మీడియాలో గాలి వార్తలు

నేను రాహుల్ ఒకే సిటీ నుంచి వచ్చాం. చాలా కాలంగా మేమిద్దరం స్నేహితులం. నేను నటిగా, ఆయన క్రికెటర్‌గా మారనప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు. మా మధ్య ఏదో అఫైర్ ఉందని గాలివార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలు మా మధ్య దూరాన్ని పెంచలేదు. మా ఫ్రెండ్‌షిప్‌కు అడ్డం కాలేదు అని నిధి అగర్వాల్ చెప్పింది.

Recommended Video

Naga Chaitanya Says Good News To Their Fans
మా మధ్య ఆ రిలేషన్ లేదు

మా మధ్య ఆ రిలేషన్ లేదు

ఇక మా మధ్య ఉన్న బంధం గురించి పెద్దగా ఆరా తీయనవసరం లేదు. మేమిద్దరం స్నేహితులం. మా మధ్య స్నేహానికి మించిన బంధం లేదు. మీడియాలో వస్తున్నట్టు మా మధ్య అఫైర్ లేదు. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని నిధి పేర్కొన్నది.

సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి

సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి

మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటిస్తున్నది. సీనియర్ నటుడు మాధవన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది.

 అఖిల్ అక్కినేనితో నిధి అగర్వాల్

అఖిల్ అక్కినేనితో నిధి అగర్వాల్

అలాగే అఖిల్ అక్కినేనితో తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించే చిత్రంలోనూ నిధి హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీలోనూ శ్రీ నారాయణ్ సింగ్ తెరకెక్కించే చిత్రంలోను నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X