శ్రియాలి భగత్ పైకి కనపడినంత అమాయకురాలేం కాదు. మొదటి సినిమా(బ్లేడు బాబ్జీ)తోనే తెలుగు ఫీల్డులో సెటిలవటానికి సరపడ నాలెడ్జ్ ,పరిచయాలు సంపాదిస్తోందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అందులోనూ ఈ ముంబయి ముద్దుగుమ్మ నటించిన గుడ్ లక్ (జస్ట్ మై లక్ హిందీ ఫ్రీమేక్) డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఇక్కడే తన తర్వాత రోజులు గడపాలని అర్ధం చేసుకుందని దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. దానిలో భాగంగానే తెలుగులో తన డైలాగులుకు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని అందుకోసం తెలుగు నేర్చుకుంటానని నరేష్ ని అడిగిందిట. అప్పటికే ఫర్జానా ప్రేమ నుండి కోలుకుంటున్న అతను గబగబా ఓ.కె చేసేసి సాయింత్రాలు ఈ అందగత్తెకు ప్రెవేట్ లెస్సన్స్ చెప్తున్నాడుట. అయితే గిట్టని వారు అవి ప్రేమ పాఠాలని అపార్ధం చేసుకుంటున్నారుట. పాడు లోకం అన్నీ అనుమానేలే అని వీళ్ళు జంటగా పాడుకుంటున్నారుట.