మార్చాల్సిందే?: 'సైరా'పై చిరుకు అసంతృప్తి.. స్పెషల్ ఇంట్రెస్ట్‌తో అతన్ని పిలిచారట..

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి'పై ఊహాగానాలకు తెరపడటం లేదు. సినిమా మొదటి షెడ్యూల్‌పై చిరంజీవి అసంతృప్తితో ఉన్నాడని ఆమధ్య ప్రచారం జరగ్గా.. స్క్రిప్టులో మార్పులు చేయబోతున్నారన్న ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, డైలాగ్స్ విషయంలో చిరంజీవి అంత సంతృప్తిగా లేరట..

విషయమేంటి?:

విషయమేంటి?:

స్క్రిప్టు విషయంలో అసంతృప్తితో ఉన్న చిరంజీవి.. అర్జెంటుగా అందులో మార్పులు-చేర్పులు చేయాల్సిందిగా దర్శకుడికి సూచించారట. దీంతో వెంటనే రచయితలు పరుచూరి బ్రదర్స్, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రాను రంగంలోకి దించారట.

 చిరంజీవి స్పెషల్ ఇంట్రెస్ట్‌..:

చిరంజీవి స్పెషల్ ఇంట్రెస్ట్‌..:

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. ఆ స్థాయి డైలాగ్స్ సరిగ్గా కుదరలేదట. అందుకే సాయిమాధవ్‌ను కూర్చోబెట్టి స్పెషల్ ఇంట్రెస్ట్‌తో చిరంజీవి డైలాగ్స్ రాయించుకుంటున్నారట. ఇక కథ విషయంలో పరుచూరి బ్రదర్స్.. అక్కడక్కడ మార్పులు చేర్పులు మొదలుపెట్టారని తెలుస్తోంది.

 రెండో షెడ్యూల్:

రెండో షెడ్యూల్:

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్‌కు వెళ్లనుంది. ఈలోగా స్క్రిప్టును పక్కాగా రెడీ చేసి చిరంజీవితో మరోసారి మాట పడవద్దని భావిస్తున్నాడట దర్శకుడు.

కథపై వివాదం:

కథపై వివాదం:

స్క్రిప్టు సంగతి పక్కనపెడితే.. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర కూడా వివాదాస్పదమవుతుండటం గమనార్హం. 'సైరా'లో చూపించబోతున్నట్లు ఆయనేమి దేశభక్తుడు కాదని, ఒక దోపిడీ దొంగ అని నెక్కంటి శ్రీనివాసరావు అనే ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.

ఉయ్యాలవాడపై ఆరోపణలు..:

ఉయ్యాలవాడపై ఆరోపణలు..:

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక దొంగ అని, దోపిడీదారుడని నెక్కంటి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 11 రూపాయలను బ్రిటీష్‌వాళ్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఇవ్వలేదని.. ఆ కక్షతో దారి దోపిడీకి తెగబడ్డాడని అంటున్నారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు కాదని, అలాంటి వ్యక్తి పట్టుకుని దేశభక్తుడిగా చూపించవద్దని ఆయన వాదిస్తున్నారు.

 చిరు గురువుగా అమితాబ్..:

చిరు గురువుగా అమితాబ్..:

'సైరా'లో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చిరంజీవికి గురువు పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్‌ సంస్థలో రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X