twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెస్ట్ టైటిల్ కోసం బాలకృష్ణ వెయిటింగ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : త్వరలో బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు..అదే ప్రచారంలోకి వచ్చింది కూడా. అయితే బాలకృష్ణ వేరే టైటిల్ వెతకమని చెప్పినట్లు సమాచారం.

    రూలర్ టైటిల్ పై తనకు ఆసక్తి లేదని, వేరే పవర్ ఫుల్ టైటిల్ ఫైనలైజ్ చెయ్యమని,ఆ టైటిల్ కూడా తెలుగులో ఉంటే బావుండునని చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి టైటిల్,హీరోయిన్ వేటలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది.

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.

    అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు. ఇక ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు.

    ఇక ఆ చిత్రానికి 'రూలర్' టైటిల్ అని, మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తారని, నయనతార హీరోయిన్ అనీ.. ఇలా ఏవేవో ప్రచారమవుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా నిజం కాదు. అలాగే ఇందులో రాజకీయ అంశాలుంటాయని కూడా భావిస్తున్నారు. నేను కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని కాబట్టి.. ఆ విలువలు కచ్చితంగా ఈ చిత్రంలో ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి.

    'సింహా'లో బాలయ్యలో కనిపించిన వాడి వేడి ఏ మాత్రం తగ్గవు. అందరూ అనుకుంటున్నట్లు రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ ఉంటే.. పైన చెప్పిన అంశాలకు ఇవి బోనస్ అవుతాయి. అంతేకానీ అవి లేకుండా పాలిటిక్స్‌కే పరిమితం అయ్యే సినిమా కాదు.

    బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా అని చెప్పారు.

    English summary
    Balakrishna was previously directed by Boyapati Srinu in Simha, which went on to become a super hit. He is searching for a better title in hope that title of the film itself has a massive impact on the audience. Boyapati Srinu is also searching for the leading woman of this film. Let's hope that he gets the best in both regards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X