హాట్ టాపిక్: చిరంజీవి కోసం రాజమండ్రిలో వెతుకులాట! ఇదీ విషయం..

చిరంజీవి కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలో వెతుకులాట జరుగుతోందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ కోసం ఓ డైరెక్టర్ చేస్తున్న ఈ పని జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ వెతుకులాట ఏంటి? దానితో చిరంజీవికి లింకేంటి? వివరాల్లోకి పోతే..

 రాజమండ్రి పరిసరాల్లో కొరటాల పరిశీలన

రాజమండ్రి పరిసరాల్లో కొరటాల పరిశీలన

ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో తన కోరిక తీర్చుకున్న చిరంజీవి.. తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. అయితే చిరంజీవి చేస్తున్న ఈ సినిమా కోసం రాజమండ్రి పరిసరాలను పరిశీలిస్తున్నారట డైరెక్టర్ కొరటాల.

షూటింగ్ స్టార్ట్.. ఆ వెంటనే రాజమండ్రిలో

షూటింగ్ స్టార్ట్.. ఆ వెంటనే రాజమండ్రిలో

మెగాస్టార్ 152 ప్రాజెక్టుగా తెరకెక్కనుంది కొరటాల శివ- చిరంజీవి కాంబో మూవీ. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ డిసెంబర్ 26వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాట చిత్రీకరణతో షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. త్వరత్వరగా ఈ షూటింగ్ ఫినిష్ చేసి రాజమండ్రి వెళ్లనుందట కొరటాల టీమ్.

చిరంజీవి కోసమే ఈ వెతుకులాట

చిరంజీవి కోసమే ఈ వెతుకులాట

ఈ మేరకు రాజమండ్రిలోని అందమైన లొకేషన్స్ చూసే పనిలో పడ్డారట కొరటాల శివ. ఈ సినిమాలో నాచురల్ లొకేషన్స్‌కే పెద్దపీట వేయాలని భావించిన ఆయన.. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆ లొకేషన్స్ వెతుకులాట ప్రారంభించారని తాజా సమాచారం. ఈ మేరకు త్వరలోనే చిత్రబృందంతో కలసి రాజమండ్రిలో ల్యాండ్‌ కావాలని కొరటాల భావిస్తున్నారట.

నయనతార అనుకున్నారు.. త్రిష ఫైనల్

నయనతార అనుకున్నారు.. త్రిష ఫైనల్

చిరంజీవి- కొరటాల శివ ప్రాజెక్టు మొదలు కాకముందు నుంచే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై వార్తలు వచ్చాయి. నయనతార, త్రిష పేర్లు ఎక్కువగా వినిపించాయి. చివరకు త్రిష ఫైనల్ అయిందని టాక్. త్రిషతో కొరటాల శివ చేసిన సంప్రదింపులు సక్సెస్ కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందందని అంటున్నారు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
కొరటాల స్క్రిప్ట్.. కాన్సెప్ట్ ఇదే

కొరటాల స్క్రిప్ట్.. కాన్సెప్ట్ ఇదే

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేశారు కొరటాల శివ. ఈ సినిమా పురాతన దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి లుక్ మెగా అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు. మొత్తానికి షూటింగ్ మొదలు కాకముందే మెగా152పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X