twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదా 'దూకుడు' 50 రోజుల పండుగ సీక్రెట్?

    By Srikanya
    |

    మహేష్ తాజా చిత్రం దూకుడు 50 రోజుల పండుగని విజయవాడలో జరపనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పబ్లిక్ పంక్షన్స్ పెద్దగా ఎంకరేజ్ చెయ్యని మహేష్ ఎందుకిలా ముందుకొచ్చి యాభై రోజులకే పంక్షన్ జరుపుతుంటే ఆసక్తి చూపుతున్నాడని అందరిలో ఆసక్తి నెలకొంది.అయితే దీనికి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ విచిత్రమై సమాధానం చెప్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం దూకుడు సినిమాని ఇప్పటికే మహేష్ ఆల్ టైమ్ హిట్ గా డిక్లేర్ చేసి ట్వీట్ చేసారు.అంతేగాక నిర్మాతలు సైతం దాన్నే ధృవీకరిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు.అయితే వాటిన్నటి సారాసం మగధీరని బీట్ చేసే చిత్రం దూకుడు అని చెప్పటమే. అందుకే దాన్ని బహిరంగ సభ ద్వారా చెప్పటం తో ఆ రికార్డులను బహిరంగంగానే త్రోసి పుచ్చినట్లు వీలుతుందని,ముఖ్యంగా మహేష్ అభిమానులకను కూడా చాలా ఆనందపరిచినట్లు అవుతుందని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అదే దూకుడు 50రోజుల పంక్షన్ వెనక ఉన్న సీక్రెట్ అంటున్నారు.

    ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. విజయవాడ లో నవంబర్ 11 లేదా 12 తేదిల్లో ఈ పంక్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు.మరో వారంలో ఈ డేట్ ని ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మహేష్ పంక్షన్ కి రావాలి కాబట్టి ది బిజెనెస్ మ్యాన్ షెడ్యూల్ ని బట్టి డేట్ ఫిక్స్ అవుతుంది.ఇక ఈ పంక్షన్ కి లక్షల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హాజరు అవుతారని చెప్తున్నారు.అలాగే ఈ పంక్షన్ కి రావటానికి మహేష్ కి ప్రత్యేకమైన హెలీకాప్టర్ ని ఎరేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇక దూకుడు ఓ రేంజి కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది.. ప్రతీ రోజు మీడియాలో వీటికి సంభందించిన వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కొందరు కావాలని హైప్ క్రియోట్ చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు.అయితే మహేష్ తాజాగా తన ట్విట్టర్ లో రాస్తూ..ఇది అపీషయల్..దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్..అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఇక యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ సినిమాగా ఈ చిత్రం అన్ని వర్గాలని ఆకట్టు కోవటంతో దాదాపు అందరూ మొదటి రెండు వారాల్లోనే ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు

    English summary
    Dookudu is running towards 50 days, the producers of the movie are planning to celebrate it in big way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X