షాక్: కాజల్ కావాలనే న్యూడ్ ఫోటో డ్రామా
కాజల్ కీ ఎఫ్ హెచ్ ఎం ఆంగ్ల పత్రిక వారికీ మధ్య న్యూడ్ పోటో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఆ వార్ అంతా వట్టిదేనని,కేవలం పబ్లిసిటీ స్టంటేనని బాలీవుడ్ పత్రికలు తేల్చి చెప్తున్నాయి. కాజల్ ను బాలీవుడ్ లో పెద్దగా తెలియకపోవటం,అదే సమయంలో ఎఫ్ హెచ్ ఎం పత్రిక ను తెలుగు పరిశ్రమలో వారికి పరచయం లేకపోవటం ఈ డ్రామాకి దారి తీసాయని చెప్తున్నారు. ఇలా ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటం ద్వారా కాజల్ గురించి బాలీవుడ్ లోనూ ,ఎఫ్ హెచ్ ఎం ఆంగ్ల పత్రిక గురించి తెలుగు వారికి పరిచయం ఏర్పడలానే ఉభయలు కలిసి వేసిన పబ్లిసిటీ ప్లాన్ గా వివరిస్తున్నారు. బాలీవుడ్ లో ఎదగటానికి పి ఆర్వో ని పెట్టుకున్న కాజల్ అక్కడ వారి సూచనలు మేరకు ఎఫ్ హెచ్ ఎం ఆంగ్ల పత్రిక లో ఫోటో షూట్ కి అంగీకరించటం, ఈ కాంట్రావర్శికి తెరతీయటం జరిగిందని సమాచారం. ఇక ఈ డ్రామా జరిగిన విధానం....వారం రోజుల క్రితం ఎఫ్ హెచ్ ఎం ఆంగ్ల పత్రిక కవర్ పేజిపై కాజల్ అగర్వాల్ టాప్ లెస్ ఫోజ్ వచ్చింది.
అయితే తాను అలా ఫోజ్ లు ఇవ్వలేదని,అదంతా మార్పింగ్ వ్యవహారమని కాజల్ తేల్చేసింది. కానీ ఆ విషయాన్ని ఎఫ్ హెచ్ ఎం పత్రిక వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తామకు అలా వేరొకరి ఫోటోలను మార్పింగ్ చేసి తమ కవర్ పేజి మీద వేసుకోవాల్సిన ఖర్మ పట్టేలంటూ వారు ఖండన ఇచ్చారు. ఈ విషయంపై ఎడిటర్ కబీర్ శర్మ మాట్లాడుతూ,,,గతంలో ఎప్పుడూ మా మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు. మేము కాజల్ మీద ఆగస్టు 18 న ఫోటో షూట్ చేసాం. ముంబైలో జరిగిన ఈ షూట్ కి ఆదారాలు మా వద్ద ఉన్నాయి. త్వరలోనే మేము ఆ ఫోటో కు చెందిన రా పిక్చర్స్ ని ఇంటర్ నెట్ లో పెడతాం. అలాగే ఆమె ఇలా ఫోజ్ ఇస్తానని ఒప్పకుని సైన్ చేసిన పేపర్లు మా వద్ద ఉన్నాయి. మార్పింగ్ చేసామంటూ ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. అంటే మా బ్రాండ్ ని వారు అవమానం చేసినట్లే.కాజల్ అలా ఫోటో షూట్ అయ్యాక మనస్సు ఎందుకు మార్చుకుందో మాకు తెలియదు..త్వరలోనే నిజా నిజాలు బయిటకు వస్తాయి అని తేల్చి చెప్పాడు. ఇలా ఇద్దరూ కలిసి పెద్ద డ్రామా ఆడారని చెప్పుకుంటున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











