ప్రిన్స్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీ వెనక సీక్రెట్..!?
ఇప్పటి వరకూ టాలీవుడ్ లో రికార్డ్స్ అన్నీ బ్రెక్ చేసిన మహేష్ ఇప్పుడు బాలీవుడ్ రికార్డస్ బ్రేక్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. మహేష్ -పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'ది బిజినెస్ మ్యాన్" చిత్రం రూపొందుతున్ విషయం తెలిసిందే. ఈ సినిమాని పూరి జగన్నాధ్ సంక్రాంతి కి విడుదల చేయాలనీ భావిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం నమ్రత శిరోద్కర్ అని సమాచారం.
కాగా మహేష్ బాబు హరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ది బిజినెస్ మ్యాన్" చిత్రం హిందీ వెర్షన్ లో కూడా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ లో నటించడానికి మహేస్ అంగీకరించడానికి ప్రధాన కారణం అతని భార్య నమ్రత, నమ్రత బ్రదర్ అని సమాచారం. ఇదివరకే కొన్ని సినిమాలు హిందీ లోకి రిలీజ్ చేయాలనీ అనుకున్న ఏ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే నమ్రత సోదరుడు అక్కడ రాజకీయాల్లో ఉన్నాడు. తను ఈ సరి బిజినెస్ మాన్ కి మంచి దియేటర్లలో రిలీజ్ చేయడానికి మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చాడట. అందుకే ఈ సారి మహేష్ అక్కడ కూడా పాగా వేయాలని చూస్తున్నారు.
నమ్రత బ్రదర్ అండదండలు మహేష్ కి బాగా కలిసోచ్చే అంశమని తెలుస్తోంది. ఆ పరంగా మహేష్ హిందీ సినిమాకి మంచి డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్స్ పబ్లిసిటీ దొరికే అవకాశముందట. అందుకే మహేష్ బాలీవుడ్ రంగప్రవేశానికి ఇష్టపడినట్టు సమాచారం. పూరి జగన్నాధ్ 'బుడ్డా" సినిమాతో బాలీవుడ్ లో తనేంటో నిరూపించుకున్నాడు కాబట్టి ఈ సినిమాకి అది కూడా ప్రమోషన్ లో ఉపయోగపడుతుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మహేష్ అక్కడ కూడా రాణించి తెలుగు చిత్ర సీమని మరింత పైకి తీసుకెళతాడు అని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











