'ముకుంద' ఆలస్యానికి అసలు కారణం?

By Srikanya

హైదరాబాద్‌: సినిమా ఎంత బాగా తీసామన్నది ఎంత ఇంపార్టెంటో, రిలీజ్ కూడా అంతే ప్రాముఖ్యమైనది. దాంతో తమ చిత్రం రిలీజ్ కు ముందు వెనక ఏయో సినిమాలు ఉన్నాయి...మంచి థియోటర్స్ దొరుకుతున్నాయా లేవా అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే సినిమావాళ్ళు రిలీజ్ డేట్ లు ఎనౌన్స్ చేస్తూంటారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ లేదా స్టార్ హీరోల సినిమాలతో పోటి పడి ఎవరూ విడుదల చేయటానికి ఇష్టపడరు.

నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ముకుంద'. పూజాహెగ్డే హీరోయిన్. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ అవుతుందని అంతా భావించారు. అయితే రిలీజ్ కాలేదు. దానికి కారణం...శంకర్,విక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఐ చిత్రం అంటున్నారు. ఐ ని సైతం దీపావళికి విడుదల చేస్తామన్నారు. దాంతో ముకుందాని ఆపు చేసారు. కాని గ్రాఫిక్స్ లేటవటం, బిజెనస్ కూడా పూర్తి కాకపోవటంతో వాయిదా వేసారు.

ఐ చిత్రం రిలీజ్ సమయంలో విడుదల చేస్తే ... థియోటర్స్ సమస్య రావటమే కాకుండా, దృష్టి మొత్తం ఐ మీద ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ఐ కు ఎదురు వెళ్ళటం అనవసరం అని ఆగారు. అయితే ఇప్పుడు ఐ చిత్రం సంక్రాంతికి అంటున్నారు. అయితే ఖచ్చితంగా ఇదే డేట్ అని ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ముకుందా చిత్రం రిలీజ్ డైలమోలో పడిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Secret behind Varun teja's Mukunda delay

ఇంతకుముందు ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే గోవిందుడు అందరి వాడే రిలీజ్ అవుతూండటంతో మెగా అభిమానులు మధ్య ఇబ్బంది రాకూడదని, సినిమాని వాయిదా వాయిదా వేసారు. తర్వాత ఇలా ఇబ్బంది ఎదురైంది.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుందా'. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ‘ముకుందా' ఆడియోని నవంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

‘ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.

సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ‘‘ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. సినిమా బాగా వచ్చింది '' అని అన్నారు.

లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X