పార్వతి మిల్టన్ ని వరుడు చిత్రం నుంచి తీసేసారు అని వినగానే తెలుగు పరిశ్రమలో అంతా ఆమెపై సానుభూతి కురిపించారు. అంతేగాక యధాశక్తి త్రివిక్రమ్ ని తిట్టుకున్నారు. కానీ అసలు ఏం జరిగింది..ఆమెను గెట్ అవుట్ అనటానికి కారణమేంటి అన్నది ఇప్పుడిప్పుడే వినపడుతోంది. అది మరేదో కాదని పార్వతి మిల్టన్ ఏటిట్యూడ్ అని అంటున్నారు. మొదట త్రివిక్రమ్ కి దగ్గరైన ఆమె అనంతరం మహేష్ కి దగ్గరవుదామని పాచికలు కదిపిందని అంటున్నారు. అంతేగాక మహేష్ ని తనకు మిగతా ప్రొడక్షన్ కంపెనీలకు రికెమెండ్ చేయమని,గౌతమ్ మీనన్ ప్రాజెక్టులో ఆఫర్ ఇప్పించమని,అవకాశముంటే బాలీవుడ్ వ్యక్తులను పరిచయం చేయమని పోరిందని చెప్తున్నారు. దాంతో విసుగెత్తిన మహేష్ కష్టపడమే విజయ రహస్యమని చెప్పినా ఆమె వినలేదని..దాంతో త్రివిక్రమ్ కి చెప్పటం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న త్రివిక్రమ్ మరో మాట లేకుండా ఆమెను గెట్ అవుట్ అన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతనేది తెలియాలంటే పార్వతి వచ్చి పెదవి విప్పాల్సిందే.