'రన్ రాజా రన్ ' హీరోయిన్ నెక్ట్స్ ఖరారు
హైదరాబాద్:'రన్ రాజా రన్ ' చిత్రం లో హీరోయిన్ సీరత్ కపూర్ మరో చిత్రం కమిటైందని సమాచారం. ఆమెను సందీప్ కిషన్ సరసన తీసుకుంటున్నట్లు సమాచారం. వి ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.
ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా తొలి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ కిషన్ రారా..కష్ణయ్య, జోరు చిత్రాల తరువాత మరో చిత్రాన్ని అంగీకరించారు. ఆయన హీరోగా ఉషాకిరణ్ ఫిలింస్ ఎల్.ఎల్.పి పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కణ్మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బీరువా అనే పేరుని ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

అలాగే.. సందీప్ కిషన్ తాజా చిత్రం విషయానికి వస్తే... కీర్తి ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘జోరు'. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. రాశిఖన్నా నాయిక. అశోక్, నాగార్జున్ నిర్మాతలు.
బ్రహ్మానందం, సప్తగిరి, ప్రియా బెనర్జి, సుష్మారాజ్, బాలయ్య, అజయ్, సాయాజీ షిండే, సత్యం రాజేష్, కాశీ విశ్వనాథ్, హేమ, అన్నపూర్ణమ్మ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మిరాఖ్, పాటలు: వనమాలి, భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్: వెంకట్, డాన్స్: బాబా భాస్కర్, జాని, ఆర్ట్: మురళి కొండేటి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: ఎం.ఆర్.పళనికుమార్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.


Click it and Unblock the Notifications











